Aadhaar Seeding-te

ఆధార్‌ అంకురీకరణ

 

నివాసుల అదనపు వ్యక్తిగత సమాచారాన్ని UIDAI సేకరించదు, నిల్వచేయదు. అలాగే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు సహా కులం, జాతి, మతం, ఆదాయ స్థాయి, ఆరోగ్య పరిస్థితి వంటి సంధాన సమాచారం కూడా సేకరించదు, నిల్వచేయదు. UIDAI సృష్టించిన అంకురీకరణ (seeding) పర్యావరణ వ్యవస్థద్వారా అందించే పలు ఉపకరణాలతో సేవాప్రదాన సంస్థలు తమ సమాచార నిధికి ఆధార్‌ను సంధానించుకోవచ్చు..

సేవాప్రదాన సంస్థల సమాచార నిధిలో విశిష్ట గుర్తింపును ఖచ్చితంగా నిక్షిప్తం చేసేదే ఆధార్ అంకురీకరణ ప్రక్రియ. సేవలందించే సమయంలో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణకు ఇది వీలు కల్పిస్తుంది. అంకురీకరణ ప్రక్రియను రెండు దశలలో పూర్తిచేస్తారు. తొలిదశలో లబ్ధిదారునుంచి ఆధార్ వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను సేకరిస్తున్న ఉద్దేశ్యాన్ని లబ్ధిదారు లేదా ఆధార్ సంఖ్యదారుకు సేవా ప్రదాన సంస్థ లేదా అంకురీకరణ ఏజెన్సీ సవివరంగా తెలియజేయడం అవసరం. అలాగే ఆ వివరాలతోపాటు వారి సమ్మతిని కూడా పొందాలి. రెండో దశకింద సేకరించిన సదరు సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి. UIDAI లోని కేంద్ర గుర్తింపు సమాచార భాండాగారం (CIDR)వద్దగల వివరాలతో తనిఖీ పూర్తయ్యాక సేవాప్రదాన సంస్థ వెబ్‌సైట్‌లోని సమాచార నిధికి లబ్ధిదారు రికార్డును అనుసంధానిస్తారు.

వివిధ పథకాల సమాచార నిధిలో ఆధార్ అంకురీకరణ సజావుగా సాగేవిధంగా UIDAI బహుళ కార్యకలాపాలు చేపట్టింది. ఆధార్ అంకురీకరణ చట్రంలో ఏముంటాయంటే::

  • A • సేవాప్రదాన సమాచార నిధిలో ఆధార్ అంకురీకరణ-ప్రక్రియలను వివరించే నిర్దేశిత నియమావళి UIDAI వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
  • DBT అంకురీకరణ సమాచారదర్శిని (DSDV), అంకురీకరణ తనిఖీకి ప్రమాణీకరణ ప్రక్రియ, ఈ-ఆధార్ డౌన్‌లోడ్‌, EID-UID శోధన, ఆధునిక శోధన వంటి వివిధ సేవలను UIDAI ప్రారంభించింది. రెసిడెంట్ పోర్ట‌ల్‌, దాని పర్యావరణ వ్యవస్థ భాగస్వాముల ద్వారా అంకురీకరణ ప్రక్రియను అందుబాటులో ఉంచింది
  • ఆధార్ అంకురీకరణపై UIDAI ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రిత్వశాఖలు/ విభాగాలకు, ప్రాంతీయ కార్యాలయాల్లో రాష్ట్రాల్లోని స్థానిక పాలన విభాగాలకు అనేక కార్యశాల(workshop)లు నిర్వహించింది..
  • కేంద్ర, రాష్ట్ర విభాగాల తరఫున అంకురీకరణ ప్రక్రియ చేపట్టేందుకు UIDAI 48 అంకురీకరణ ఏజెన్సీలను గుర్తించి జాబితాలో చేర్చింది. వివిధ భాగస్వామ్య సంస్థల ఆధార్ అంకురీకరణ సిబ్బందికి కంప్యూటర్, తరగతి ఆధారిత శిక్షణ కోసం పాఠ్యాంశ ప్రణాళికను రూపొందించింది.
  • Developed content including classroom training and computer based training content for various stakeholders.