ఆధార్ నమోదు ఏజెన్సీస్
UIDAI నిర్దేశిత ప్రక్రియ మేరకు నివాసుల జనసంఖ్య సంబంధ, జీవసంబంధ సమాచార సేకరణ సంస్థలైన నమోదు ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. ఇందుకోసం ఇవి UIDAIవద్ద జాబితాలో నమోదు అవుతూండాలి. ఇందులో లేనివాటిని రిజిస్ట్రార్లు ఎంపిక చేసినా జాబితాలోని సంస్థలకు వర్తించే నిబంధనలే వాటికీ వర్తిస్తాయి..
- సాంకేతిక, ఆర్థిక సామర్థ్య పరిశీలన తర్వాత రిజిస్ట్రార్లు ఎంపికచేసేవే నమోదు ఏజెన్సీలు
- ఈ ఏజెన్సీలు నమోదు కేంద్రాలకు ఆపరేటర్లు, పర్యవేక్షకులను నియమించి గరిష్ఠ నమోదుకు తగిన పరిస్థితులు సృష్టిస్తాయి..
- నివాసులతోపాటు UIDAIకి కూడా నమోదు ప్రణాళికపై ఇవి ముందుగా సమాచారమివ్వాలి
- UIDAIజాబితాలో ఉండే ఈ ఏజెన్సీలను ఆధార్ సృష్టికోసం రిజిస్ట్రార్లు నియమించి చెల్లింపులు చేస్తారు.
- నమోదు కేంద్రాల ఏర్పాటు, సమాచార సేకరణ/దిద్దుబాటు వీటి బాధ్యతలే.
- Tనమోదు కోసం UIDAIసాఫ్ట్ వేర్ మాత్రమే ఉపయోగించాలి. ప్రతి నమోదు/నవీకరణలో భాగంగా ప్రతి నమోదు ప్యాకెట్ కు సంబంధించిన ఉపయోక్త కార్యక్రమం, ఆపరేటర్, పర్యవేక్షకులు, నమోదు ప్రాతినిధ్య సంస్థ, రిజిస్ట్రార్, తదితర సమాచారాన్ని ఈ సాఫ్ట్ వేర్ అందిపుచ్చుకోగలదు.
- కంప్యూటర్, ప్రింటర్, బయోమెట్రిక్ పరికరాలు వంటివన్నీ సంస్థ ఎప్పటికప్పుడు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉండాలి..
- నమోదుకు ఉపయోగించే బయోమెట్రిక్ పరికరాలు సంస్థ నిర్దేశించిన నిబంధనల ప్రకారం, సంస్థ సూచించిన ధ్రువీకరణ ప్రక్రియకు అనుగుణంగా ఉండాలి..
- నమోదు ఆపరేటర్ భౌతిక/ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పత్రాలను సేకరించాలి. లేదా నిర్దేశిత ప్రక్రియ మేరకు ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలి.
- క్షేత్రస్థాయి కార్యకలాపాలు, తనిఖీ బాధ్యత నమోదు ఏజెన్సీదే. నమోదు కేంద్రంలోకి అధికారుల ప్రవేశానికి వీలు కల్పించాలి. పుస్తకాలు, రికార్డులు, పత్రాలు, కంప్యూటర్ సమాచారం తదితరాల తనిఖీకి అక్కడి వ్యక్తులు సహకరించాలి. ఏవైనా ఏర్పాట్లు కావాల్సి ఉంటే సమకూర్చాలి. అవసరమైతే అక్కడి వ్యక్తులు లేదా వారి తరఫున మరెవరైనా సంబంధిత సమాచారం, పత్రాల నకళ్లను తనిఖీకి అందజేయాలి.
- నమోదు ఏజెన్సీ సదా తన ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలి.
- సంస్థ సూచించే లేదా అందజేసే వివిధ ప్రక్రియలు, విధానాలు, మార్గదర్శకాలు, తనిఖీ జాబితాలు, ఫారాలు, ఇతరత్రా అంశాలకు నమోదు ఏజెన్సీ కట్టుబడి ఉండాలి.
నమోదు ఏజెన్సీల కార్యకలాపాలు
- నమోదు కేంద్రాల ఏర్పాటు కోసం నిర్దేశిత జాబితాకు తగినట్లుగా పరికరాలు, ఇతర సరంజామా సమకూర్చుకోవాలి.
- నమోదు ఆపరేటర్, పర్యవేక్షకుల పేర్లను నమోదు చేసుకుని UIDAIలో వారిని కార్యోన్ముఖులను చేయాలి.
- o అధీకృత నమోదు ఏజెన్సీ నిర్వాహకులద్వారా తొలుత ఆపరేటర్లను నియమించాలి
- o ఈ నిర్వాహకుల కోసం సమాచార ప్యాకెట్, వినియోగదారు నిర్వహణ పత్రాన్ని సిఐడిఆర్‌కు పంపాలి.
- o తొలుత ఈ ఆపరేటర్లకు విశిష్ట గుర్తింపు సంఖ్య(UID) ను పొంది, ఆ తర్వాత ఇతరుల నమోదుకు పంపాలి..
- o ఈ తొలి ఆపరేటర్ ద్వారా ఇతర ఆపరేటర్లు, పర్యవేక్షకులు, సాంకేతిక నిర్వాహకులు, పరిచయకర్తలను నమోదు చేయాలి.
- o వీరి సమాచార ప్యాకెట్లను, వినియోగ నిర్వహణ ఫైలును సిఐడిఆర్‌కు పంపాలి.
- o వీరందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య (UID) పొందాలి.
- o సిఫీ నిర్వహించే ధ్రువీకరణ పరీక్షకు వారి పేర్లను నమోదు చేయాలి.
- o సిఐడిఆర్ ధ్రువీకరణ పొందినవారు, నమోదైనవారు ఇతర పరిచయకర్తలు, నివాసుల నమోదును ప్రారంభించవచ్చు.
- కేంద్రాల నమోదు
- o నమోదు ఏజెన్సీల అధీకృత వినియోగదారు-కోడ్ ను వారి నిర్వాహక ఈమెయిల్ ఐడీద్వారా స్వీకరించాలి.
- o రిజిస్ట్రార్ కోడ్, ఏజెన్సీ కోడ్ ను UIDAIనుంచి పొందాలి.
- o తాజా ఆధార్ సాఫ్ట్ వేర్ ను పొంది, దాన్ని వ్యవస్థాపించిన ల్యాప్ టాప్లను నమోదు, ధ్రువీకరణ చేయించాలి.
- o వినియోగదారు స్థిరీకరణ, KYR, KYR+ కోసం ప్రయోగాత్మక విడుదలను పూర్తిచేయాలి,
- o నమోదుకు ముందు సమాచారం లోడింగ్.