దూరదృష్టి & దార్శనికత

దూరదృష్టి

భారతదేశంలోని నివాసులందరినీ ఒక విశిష్ట గుర్తింపు ద్వారా శక్తువంతుల్ని చేయాడానికి మరియు ఒక నివాసిని ఏ సమయంలోనైనా ఎక్కడి నుండైనా ఆధీకృతం చేయడానికి సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫాం రూపకల్పనకు

దార్శనికత

 • ఆధార్ సంఖ్యలు కేటాయిoచడం లో కఠినమైన నాణ్యతా కొలమానాలకు కట్టుబడి ఊహకందనంత తక్కువ సమయంలో విశ్వవ్యాప్తంగా నివాసులకు అందరికీ ఆధార్ జారీ చేయడంలో కృతకృత్యులు కావడం
 • నివాసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడానికి, వారి డిజిటల్ గుర్తింపును ఆధీకృతం చేయడానికి సౌకర్యాలను కల్పించే వసతులతో భాగస్వామ్యం వహిస్తాం.
 • నివాసులకు ప్రభావశీలంగానూ మరియు సమాదరంగానూ ఆధార్ అందించడానికి భాగస్వాములతో, సేవలను అందించేవారితో కలిసి పనిచేస్తాం.
 • ఆధార్‌లో అనుసంధానితమైన అప్లికేషన్ల వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తాం.
 • సాంకేతిక వనరుల అందుబాటు, సామర్థ్యం మరియు మార్పులకు అనుకూలతలను నిర్ధారిస్తాం.
 • భా. వి. గు. ప్రా. సం. ల యొక్క దార్శనికత మరియు విలువలను చాలాకాలం తీసుకువెళ్ళగలిగే మన్నికైన సంస్థగా రూపొందించడం.
 • భా. వి. గు. ప్రా. సం. సంస్థను ప్రపంచ అత్యుత్తమ నైపుణ్యం కల సంస్థగా తీర్చిదిద్దడానికి భాగస్వామ్యం వహించడం మరియు భా. వి. గు. ప్రా. సం. కు విలువైన ఆలోచనలను అందించడం.

మూల సిద్ధాంతాలు/విలువలు

 • మేము మంచి పరిపాలననుఅందించడాన్ని పూర్తిగా విశ్వసిస్తాము.
 • మేము సమ్మిళిత జాతి పునర్నిర్మాణానికి అంకితమయ్యాం.
 • మేము మా భాగస్వాముల విలువను, భాగస్వామ్య పద్ధతిని పాటిస్తాం.
 • మేము నివాసులకు మరియు సేవలందించేవారికి మా సేవలను అందించడంలో ఉన్నతంగా ప్రయత్నిస్తాం.
 • మేము నిరంతర అధ్యయనం మరియు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో మా దృష్టిని ఎల్లప్పుడు నిలుపుతాం.
 • మేము నూతన ఆవిష్కరణను అనుసరిస్తాం. మా భాగస్వాములు నూతన ఆవిష్కరణలను చేయడానికి ఒక ప్లాట్‌ఫాంను కల్పిస్తాం.
 • మేము. పారదర్శకమైన, విశాల సంస్థగా ఉండడంలో నమ్మకాన్ని కలిగి వుంటాము.