Requesting Entities (AUA & KUA)-te

Introduction

ఆధార్ చట్టం(2016) ప్రకారం విజ్ఞప్తి సంస్థ అంటే... ఆధార్ సంఖ్యదారు విశిష్ట గుర్తింపు సంఖ్య, జీవసంబంధ లేదా జనసంఖ్యసంబంధ సమాచారాన్ని కేంద్ర గుర్తింపు సమాచార భాండాగారానికి (CIDR) అందజేసి ప్రమాణీకరణ కోరే ఒక సంస్థ లేదా వ్యక్తి.

ప్రమాణీకరణ వినియోగ సంస్థ (AUA): ఆధార్ సంఖ్యదారులకు ఆధార్ ఆధారిత సేవలను ప్రమాణీకరణ సేవా సంస్థ (ASA) ఇచ్చే ప్రమాణీకరణ ద్వారా అందించే సంస్థ ఇది. ప్రమాణీకరణ వినియోగ సంస్థగా ప్రభుత్వ/ప్రభుత్వరంగ/దేశంలో నమోదైన చట్టబద్ధ ప్రైవేటు సంస్థలకు చెందినదై ఉండవచ్చు. UIDAI అందించే ప్రమాణీకరణ సేవలను వాడుకుంటూ తన వ్యాపార/సేవా విధులు నిర్వర్తించడంలో భాగంగా ఆధార్ ప్రమాణీకరణ విజ్ఞప్తులు పంపుతూంటుంది.

Sఉప వినియోగ సంస్థలు ఇవి ప్రస్తుత ప్రమాణీకరణ వినియోగ సంస్థలద్వారా ఆధార్ ప్రమాణీకరణ సేవలను అందిస్తుంటాయి.

విజ్ఞప్తి సంస్థ (AUA, KUA)లు ASAలద్వారా CIDRతో అనుసంధానమై ఉంటాయి. (ఇవి స్వయంగా ASAలు కావచ్చు లేదా ప్రస్తుత ASAలతో ఒప్పందంద్వారా సేవలు అందించేవి కావచ్చు).

List of Live AUA

List of Live KUA

విజ్ఞప్తి సంస్థల నియామకము(అధీకృత యూసర్ ఏజెన్సీ &ఈ-కె.వై.సి సేవల యూసర్ ఏజెన్సీ)ఏజెన్సీల నియామకము:

  • ఈ ప్రత్యేక ప్రయోజనము కోరే సంస్థలు అథారిటీ నియమించిన విధానము ప్రకారము అధీకృత సేవల ఏజెన్సీలు అథారిటీ యొక్క అనుమతి కోరాలి.షెడ్యూల్ “ బి” లో పొందుపరచిన అర్హతా ప్రమాణాల పరిధి లోనీ సంస్థలు మాత్రమే అర్హులు. అర్హతా ప్రమాణాలను అథారిటీ సమయానుకూలముగా ఒక ఆర్డర్ ద్వారా మార్చే అవకాశముంది.
  • అధీకృత సేవల ఏజెన్సీస్ నుండి అథారిటీ వేరే అధిక సమాచారము మరియు ఇచ్చిన సమాచారముపై వివరణలు కోరవచ్చు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో అప్లికేషను అంగీకరించడానికి మరియు తిప్పివేయడానికి కూడా అధిక సమాచారము అవసరముంటుంది.
  • అథారిటీ ఇచ్చిన గడువు లోపులో అథారిటీ అడిగిన మేరకు అభ్యర్ది సమాచారాన్ని మరియు వివరణను అథారిటీ కు సంతృప్తి మేరకు అందించాల్సి వుంటుంది.
  • అప్లికేషను ఆమోదించే సమయము లో, అప్లికేషను తో పాటు అభ్యర్ధి ఇచ్చిన సమాచారాన్ని( డాక్యుమెంట్స్ , మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరమైన వెసులుబాటు, వుండాల్సిన రీతిలో వుందో లేదో బౌతికంగా అథారిటీ చెక్ చేసుకొనే అవకాశముంది.
  • అభ్యర్ధి అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారము, అర్హతలను బట్టి అథారిటీ ఈ క్రింది నిర్ణయాలలో ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవచ్చు:
    ఎ). అధీకృత సర్వీస్ ఏజెన్సీ గా అభ్యర్ధిని ఆమోదించవచ్చు
    బి). ఆ సం స్థతో లేక ఏజెన్సీ తో పూర్తి నియమ నిభందనలు వున్న ఒడంబడికను చేసుకోవచ్చు. వ్యతిరేకమైన లేక సరిగా నడిపించలేక పోవడం వలన నష్టాన్ని కలిగించే విషయాలు కూడా కాంట్రాక్టు పరిధి లోనికి తీసుకుంటారు
  • అప్పుడప్పుడు అథారిటీ కు సర్వీస్ ఏజెన్సీ కట్టాల్సిన ఫీ, వార్షిక రుసుము, మరియు ప్రతీ ఒక్క లావాదేవీకు వసూలు చెయ్యాల్సిన ఫీ కూడా అనుమతి ఇచ్చేటప్పుడు నిర్ణయిస్తారు మరియు రుసుము లో మార్పులు వచ్చినప్పుడు కూడా సేవ ఏజెన్సీ అనుసరించాల్సి వుంటుంది.

తప్పనిసరి రక్షణ అవసరాలు

  • డొమైన్ నిర్ధారిత గుర్తింపుగా ఆధార్ నంబర్‌ను ఎప్పుడూ వాడకూడదు.
  • ఆపరేటర్ ఆధారిత పరికరాలు అయినట్లయితే, ఆపరేటార్లు తమ పరికరాలను పాస్‌వర్డ్, ఆధార్ ఆధీకృతం మొదలైనవాటితో ఆధీకృతం చేసుకోవలసిన ఉంటుంది.
  • ఆధార్ ఆధీకృతం కోసం సేకరించిన వ్యక్తిగత గుర్తింపు డేటా (పి. ఐ. డి). బ్లాక్‌ను సంకేత నిక్షిప్త సందేశం రూపంలో మాత్రమే సేకరించాలి. దానిని పారదర్శకంగా నెట్‌వర్క్ ద్వారా ఎప్పుడూ పంపరాదు.కేవలము నిక్షిప్త రూపంలో మాత్రమే పంపాలి.
  • ఎన్‌క్రిప్ట్ చేయబడ్డ పి. ఐ. డి. బ్లాక్‌ను బఫర్డ్ ఆధీకృతం చేయడానికి పట్టే స్వల్ప వ్యవధి మినహా మరెప్పుడూ, మరెక్కడా 24 గంటలు మించి నిలువ చేయ కూడదు.
  • ఆధార్ ఆధీకృతం కోసం సేకరించిన బయోమెట్రిక్ మరియు ఒ. టి. పి. సమాచారం శాశ్వత నమోదు పరికరాలపై గానీ లేదా సమాచార నిధులలో నిలువ చేయకూడదు.
  • మొత్తం సమాచారం, దానికి సంబంధించిన సమాధానాలు, ఉప సమాచారం మొత్తం తనిఖీ కోసం ఎప్పుడూ నమోదు చేయబడినదై అందుబాటులో ఉండాలి.
  • ఎ. యు. ఎ. మరియు ఎ. ఎస్. ఎ. ల మధ్య యంత్రాంగము పటిష్టం గా , భద్రంగా ఉండాలి.

అధీక్రుతాన్ని కోరే వారి(ఎ.యు.ఎ/కె.యు.ఎ) భాద్యతలు మరియు డేటా భద్రతాంశాలు

ఆధార్ ఆక్ట్ 2016 లో అధీక్రుతాన్ని కోరే వారి(ఎ.యు.ఎ/కె.యు.ఎ) యొక్క భాద్యతలు మరియు డేటా భద్రతాంశాలు పొందుపరచ బడినవి మరియు వాటిని వాటిని పరిశీలించగలరు.