ఆధార్ డేటా నవీకరించుట

Registered Mobile Number

Registered mobile number is essential to access Aadhaar Online Services

మీ నమోదు సమయంలో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబర్ ను గాని లేక ఇటీవల ఆధార్ అప్ డేట్ సమయంలో ఇచ్చిన మొబైల్ ను గాని పరిశీలించుకొనే సౌలభ్యం

మీ నమోదు సమయంలో మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేయబడని యెడల , ఇప్పుడు రిజిస్టర్ చేయడానికి శాశ్వత ఆధార్ నమోదు కార్యాలయాన్ని దర్శించాల్సి వుంటుంది.

ప్రభుత్వ, ప్రభుత్వేతర, బ్యాంకు, బీమా, పన్నుల సేవలతోపాటు రాయితీ లబ్ధి, పింఛన్లు, ఉపకార వేతనాలు, సామాజిక పథకాల లబ్ధి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యరక్షణ వగైరాలకు ఆధార్ అనుసంధానం చేయడంవల్ల నివాసుల ఆధార్ సమాచారం సీఐడీఆర్‌లో అత్యంత కచ్చితంగా, అధునాతనంగా ఉండటం తప్పనిసరి..

జనసంఖ్యాసంబంధ నవీకరణ, ఈ కారణాలతో అవసరం కావచ్చు:

  • జీవితంలో జరిగే సహజమైన మార్పులు ,వివాహం అవ్వడం మూలంగా నివాసులు తమ పేరు మరియు చిరునామా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడవచ్చు. నివాసం మార్చడంవలన మొబైల్ నెంబర్ ,చిరునామా తప్పక మారుతుంది. వారి భందువులలో కూడా పెళ్లి, మరణము కారణముల మూలంగా నెంబర్ ,చిరునామా మార్చవలసిన అవసరం ఏర్పడుతుంది. మరే ఇతర వ్యక్తిగత కారణముల వలన కూడా మొబైల్ నెంబర్ , ఈ-మెయిలు మార్చవలసిన అవసరం వస్తుంది. వివాహం వంటివాటివల్ల నివాసుల పేరు, చిరునామా, బంధుత్వ హోదా వంటి ప్రాథమిక జనసంఖ్యాసంబంధ వివరాలు మారిపోవడానికి దారితీయవచ్చు.
  • సేవలందించే వివిధ వేదికలలో మార్పులవల్ల నివాసులే సమాచారంలో మార్పులు కోరవచ్చు. మొబైల్ ఫోన్ నంబరును సీఐడీఆర్‌లో చేర్చాల్సి రావచ్చు. నమోదు భాషను తాను కోరినట్లుగా మార్చాలని నివాసి కోరవచ్చు.
  • పుట్టిన తేదీ/వయసు మరియు లింగ భేదమునకు కు సంభందించిన గడులలో మార్పులు ప్రధమంగా నమోదు లో తలెత్తిన తప్పుల మూలంగా వస్తాయి. నివాసి దేశం లో ఎక్కడైనా నమోదు కావచ్చు కాబట్టి, తన మాతృబాష లో మాట్లాడే “A” , తన మాతృబాష “ B” అయిన ఆపరేటర్ ద్వారా నమోదు కావచ్చు. అందువలన నివాసి ప్రాంతీయ బాష “B” కావచ్చు. తరువాత ఈ నివాసి తన నమోదు చేసుకున్న ప్రాంతీయ బాషను, ఇష్టాన్ని బట్టి మరొక భష లోనికి మారాలని కోరుకోవచ్చు. అప్పుడు మొదట తీసుకున్న ఆధార్ కార్డ్ లోని బాష అంతా క్రొత్త బాష లోనికి నవీకరించ వలసి రావచ్చు. నమోదు/నవీకరణ సందర్భంగా స్వీకరించిన వ్యక్తి గుర్తింపు (PoI), చిరునామా ధ్రువీకరణ (PoA), ఇతర పత్రాల నాణ్యతను విశిష్ఠ గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) ధ్రువీకరించుకుని, జనసంఖ్యాసంబంధ సమాచార నవీరణతోపాటు పత్రాల సమర్పణద్వారా నవీకరించుకోవాల్సిందిగా నివాసులను కోరవచ్చు.
  • UIDAI may also ascertain availability of POI, POA and other documents collected at the time of enrolment/update and its quality and decide to notify resident to update their demographic information and submit the required document.

జీవ సంబంధ (బయోమెట్రిక్) నవీకరణ, ఈ కారణాలతో అవసరం కావచ్చు:

  • తొలి నమోదు సమయంలో ఐదేళ్లలోపు పిల్లలు- వీరికి ఐదేళ్లు వచ్చిన తర్వాత మరలా తిరిగి నమోదు చేయించాలి మరియు వారి మొత్తం జీవసంబంధ సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఈ దశలోనే పిల్లల సమాచార పునరావృత నివారణ చేపడతాం. ఈ విజ్ఞప్తిని కొత్త నమోదుతో సమానంగా పరిగణించినా దీనికిముందు జారీచేసిన ఆధార్ సంఖ్య మాత్రం మారదు.
  • నమోదు సమయంలో 5-15 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు 15 ఏళ్లు నిండగానే వారి జీవసంబంధ సమాచారాన్ని నివాసులే సమర్పించి నవీకరించుకోవాలి.
  • నమోదు సమయంలో 15 ఏళ్లకుపైబడి ఉన్న పిల్లలకు ప్రతి పదేళ్లకొకసారి బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవాలని సిఫారసు చేస్తున్నాం.
  • ప్రమాదాలు, వ్యాధులవల్ల అవయవ నష్టం వంటి సందర్భాల్లో జీవసంబంధ వివరాల నమోదు మినహాయింపు అవసరం రావచ్చు
  • ఆధార్ వ్యాప్తి విస్తరిస్తున్నందున ధ్రువీకరణ వైఫల్యాల((ఆధార్ సవ్యంగానే జారీ అయినా పొరపాటున తిరస్కరణ జరిగినప్పుడు) వల్ల నివాసులు నవీకరణ కోరవచ్చు. లేదంటే జీవసంబంధ వివరాలు సరిగా నమోదు కాకపోవడం లేదా నమోదులో నాణ్యత లోపం కూడా కారణం కావచ్చు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడుతున్నందున మంచి నాణ్యతతో సిఐడిఆర్ లో తిరిగి సేకరించవచ్చు..
  • నమోదు/నవీకరణలో సేకరించిన బయోమెట్రిక్ వివరాల నాణ్యతను విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) పరిశీలించి నిర్దిష్ట ప్రమాణాన్ని నిర్ణయించవచ్చు. ఈ స్థాయికన్నా తక్కువ స్థాయిలో ఉన్న నివాసులు తమ బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవాలని UIDAI నోటిఫికేషన్ జారీచేయవచ్చు..

నవీకరించుకోదగిన ఆధార్ వివరాలు:

జనసంఖ్య సంబంధ

పేరు, చిరునామా, పుట్టిన తేదీ/వయసు, లింగం,

జీవసంబంధ సమాచారం

కనుపాపలు, వేలిముద్రలు, ముఖం

ఆధార్ నమోదు ప్రక్రియలో భాగంగా యు.ఐ.డి.ఎ.ఐ. విస్తృతమైన వ్యక్తిగత(PoI) మరియు చిరునామా (PoA) ధృవీకరించే పత్రాలను స్వీకరిస్తుంది. ఆధార్ నమోదు కొరకు దేశంలో ఎక్కడైనా చెల్లు బాటు అయ్యే పత్రముల వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నవీకరణ పద్ధతులు

 

1.స్వీయ-సహకార పద్దతి

నివాసి ఎవరి అవసరం లేకుండా తన ఆధార్ లో మార్పుల అభ్యర్ధనను ఈ క్రింద సూచిస్తున్న పద్దతులు అవలబించవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా: ఆన్‌లైన్‌లో స్వయంసేవా పద్ధతిద్వారా జనసంఖ్యాసంబంధ వివరాలను నవీకరించుకోవచ్చు. ఇందుకు ఎవరి సాయమూ అవసరంలేకుండా ఇంటర్నెట్ ఉపయోగించి https://ssup.uidai.gov.in/web/guest/ssup-homeలో నేరుగా అభ్యర్థన దాఖలు చేయవచ్చు. ఆధార్ సంఖ్యను, నమోదుచేసిన మొబైల్ నంబరును ఉపయోగించి ఈ పోర్టల్ లో లాగిన్ కావచ్చు. ఒకసారి వినియోగించగల సంఖ్య వారి మొబైల్ ఫోనుకు అందుతుంది. దాని సాయంతో వెబ్ సైట్లో ప్రవేశించాలి. నవీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు స్వీయ ధ్రువీకరణతో వ్యక్తిగత, చిరునామా నిర్ధారణ పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోని వివరాలను నవీకరణ కార్యాలయం తనిఖీ చేసి, మార్చాల్సిన సమాచారంతో పోల్చిచూస్తుంది. ఈ ప్ర్రక్రియ కోసం దరఖాస్తుదారు తన మొబైల్ నంబరును ముందుగానే నమోదు చేసి ఉండాలి. లేనిపక్షంలో పైన సూచించిన వెబ్ చిరునామాలోనే లభ్యమయ్యే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, నింపి పోస్టుద్వారా పంపాలి.ఈ సేవను పొందడానికి నివాసి మొబైల్ నెంబర్ తప్పక రిజిస్టర్ అయి వుండాలి

Using self-service Update Portal for online Aadhaar Data Update: Step 1 - Login to SSUP portal using Aadhaar and OTP, Step 2 - Select the fields to be updated, Step 3 - Fill the data in the selected fields, Step 4 - Submit the form & URN will be generated, Step 5 - Select the BPO for review of update, Step 6 - Attach original scanned copy of the support document, Step 7 - Using the URN check Aadhaar update status

2.సహాయం చేయుట ద్వారా(నమోదు కేంద్రాన్ని సందర్శించినపుడు)

ఈ క్రింది పద్దతులలో నివాసి తన యొక్క డేటా నమోదు కేంద్రములో వున్న ఆపరేటర్ సహాయంతో నవీకరించుకోవచ్చు. ఈ పరిస్థితులలో డాక్యుమెంట్స్ నకళ్ళు ఆధారాలను ఆపరేటర్ తీసుకుంటాడు మరియు నవీకరణకు సంభందించిన పరిశీలన కూడా పరిశీలకుడి ద్వారా అక్కడే జరుగుతుంది. ప్రస్తుతము యు. ఐ.డి.ఎ.ఐ సహాయం చేయుట ద్వారా నవీకరించే మూడు రకముల పద్దతులను అందుబాటులో ఉంచినది.

 

a. అప్ డేట్ క్లైంట్ స్టాండర్డ్

సంబందిత గడులు: : బయోమెట్రిక్ మరియు డెమోగ్రాఫిక్ ఫీల్డ్ వివరములు మరియు ప్రాంతీయ బాషకు సంభందించిన వివరములు నవీకరించు కోవచ్చు.

గుర్తింపు అధీకృతము బ్యాక్ ఎండ్ లో బయోమెట్రిక్ చెక్

 

పత్రముల పరిశీలన/ఎక్కడైతే పత్రములు సమర్పించి నవీకరించు కోవాలో ఆ ఖాళీలకు సంభందించి పత్రాల పరిశీలన

  • యు.ఐ. డి.ఎ.ఐ లేక రిజిస్ట్రార్ ద్వారా నియమింప బడిన పరిశీలకుడు పత్రాలను పరిశీలిస్తారు..
  • పరిశీలనా ప్రక్రియ అంతా నమోదు ప్రక్రియ కు సంభందించి డి.డి.ఎస్.వి.పి. కమిటీ చేసిన సూచనల ప్రకారమే నిర్వహించాలి.

 

ఫార్మ్ పూరించుట మరియు రశీదు

  • నివాసి కోరిన విధంగా ఆపరేటర్ అప్డేట్ క్లైంట్ లో ఈ పని చేస్తాడు అంతే కాకుండా బాష సంభంధమైన అక్షర మరియు వ్యాకరణ దోషములు సరి చేస్తారు

 

Resident gets an acknowledgement receipt with Update Request Number (URN) which can be tracked.

Biometric Update Process: Step 1 - Filling Application Form, Step 2 - Manual Verification of proof, Step 3 - Entry of Data into client software by operator, Step 4 - Biometric Authentication by Resident, Step 5 - Operator & Supervisor's Confirmation, Step 6 - Acknowledgement of Receipt

b. Update Client Lite (UCL)

ప్రతీ నవీకరణ తరువాత బయోమెట్రిక్ సైన్ ఆప్ చేస్తారు..

తిరిగి నవీకరణ స్థితి ని తెలుసుకోనే వీలు వున్న అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వున్న రశీదు ను నివాసికి అందజేస్తారు.

అప్డేట్ క్లైంట్ లైట్

  • సంబందిత గడులు: అన్ని డెమోగ్రాఫిక్ ఫీల్డ్ వివరములు మరియు ఫోటో ప్రాంతీయ బాషకు సంభందించిన వివరములు నవీకరించు కోవచ్చు. రిజిస్ట్రార్/ఎ.యు.ఎ/” అందరు రిజిస్ట్రార్లు మరియు కే.యు.ఎ గుర్తింపు ప్రామాణీకరణ :నివాసి బయోమెట్రిక్ ప్రామాణీకరణ
  • పత్రముల పరిశీలన
  • ఎక్కడైతే పత్రములు సమర్పించి నవీకరించు కోవాలో ఆ ఖాళీలకు సంభందించి పత్రాల పరిశీలన

 

పరిశీలనా ప్రక్రియ అంతా నమోదు ప్రక్రియ కు సంభందించి డి.డి.ఎస్.వి.పి. కమిటీ చేసిన సూచనల ప్రకారమే నిర్వహించాలి.

  • నివాసి కోరిన విధంగా ఆపరేటర్ అప్డేట్ క్లైంట్ లో ఈ పని చేస్తాడు అంతే కాకుండా బాష సంభంధమైన అక్షర మరియు వ్యాకరణ దోషములు సరి చేస్తారు. ప్రతీ నవీకరణ తరువాత బయోమెట్రిక్ సైన్ ఆప్ చేస్తారు

 

c. నివాసి కోరిన విధంగా ఆపరేటర్ అప్డేట్ క్లైంట్ లో ఈ పని చేస్తాడు అంతే కాకుండా బాష సంభంధమైన అక్షర మరియు వ్యాకరణ దోషములు సరి చేస్తారు.

ప్రతీ నవీకరణ తరువాత బయోమెట్రిక్ సైన్ ఆప్ చేస్తారు..

ఎ.యు.ఎ పాయింట్ లో నవీకరణ AUA’sఈ పద్ధతి కొన్ని ప్రత్యేక రిజిస్ట్రార్ లు , ఎ.యు.ఎ అయిన వారి పరిశీలనలో మాత్రమే జరుగుతుంది

నవీకరణ కోసం యు.ఐ.డి.ఎ.ఐ అప్లికేషను లేక ఎ.పి.ఐ సరపరా చేస్తుంది.. ఈ ప్రత్యేక పనికోసం నియమింపబడిన రిజిస్ట్రార్ లు నవీకరణ డేటా సేకరించి/నవీకరణ చేసి/ఆ ప్రత్యెక డేటా ను భద్రపరస్తూ దాని సంరక్షణ బాధ్యతను తీసుకొంటారు.

గుర్తింపు అధీకృతము: ఎ.యు. ఎ పరికరము పై బయోమెట్రిక్ అధీకృతము. అధిక ఆత్ ఫాక్టర్ వాడడంలో యు. ఐ.డి.ఎ.ఐ నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు అప్ డేట్ అభ్యర్ధన మొబైల్ లో ఒ.టి.పి ద్వారా రాబట్టడం లాంటివి

మైక్రో ఎ.టి.ఎం లాంటి బయోమెట్రిక్ అధీక్రుతం చేసే లక్షణం వున్న పరికరముతో రిజిస్ట్రార్ ఆపరేటర్ (సొంత లేక అవుట్ సౌర్సుద్ ఉద్యోగి) ఫారం పూరిస్తారు

 

అప్ డేట్ అభ్యర్ధన తీసుకుని, ప్రక్రియ పూర్తి అయిన తరువాత రిజిస్ట్రార్ ప్రింట్ రశీదు ఇచ్చే వీలు వుంది..

  • రశీదు పై వివరములు ప్రింట్ చేసి కాని, ఎస్.ఎం.ఎస్ రూపంలో కాని, ఈ-మెయిల్ రూపం లో కాని ఉండవచ్చు. ఉదాహరణకు మొబైల్ నెంబర్ అప్డేట్ కొరకు రశీదు ఆ మొబైల్ నెంబర్ లోనే ఎస్.ఎం.ఎస్ రూపంలో వస్తుంది. ఎ.పి.ఐకు ప్రింట్ రశీదులుమరియు ఎలక్ట్రానిక్ రశీదులు ఇచ్చే సామర్ధ్యం వుంది.