అధీక్రుతం ఎకో సిస్టంస్
ఆధార్ అధీక్రుతం అంటే ఏమిటీ?
ఆధార్ అధీక్రుతం అంటే ఆధార్ గ్రహీత తన ఆధార్ నెంబర్ తో పాటు నివాస సంభంద సమాచారాన్ని మరియు బయోమెట్రిక్ సమాచారాన్ని జోడించి కేంద్ర డేటా గుర్తింపు రేపోసిటరీస్ కు పరీశీలన కొరకు పoపుట మరియుఆధార్ నెంబర్ కరెక్ట్ అయినదా లేదా అనేదానిని అందిన సమాచారము ను బట్టి తెలుపుతుంది.
అవలోకనం
కేవలము ఆధార్ నెంబర్ గానీ లేక అధీక్రుతము గానీ తనంతట తానే ఏదైనా హక్కు ఇవ్వడం రుజువు గా వుండడం గానీ, గానీ లేక సిటిజెన్షిప్ లేక స్వస్థల నివాసి అని గానీ నిర్ణయించ లేదు.
కన్స్యూమర్ సర్వీసెస్, సుబ్సిదీస్ మరియు ప్రయోజనాలు అందించడానికి సర్వీస్ ప్రొవైడర్స్ అనేకులు వ్యక్తులను తమ వ్యక్తిగత గుర్తింపులను చూపమని కోరుచున్నారు. ఈ గుర్తింపులను సేకరించునపుడు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ వ్యక్తులు ఇచ్చిన రుజువులు సరియైనవా లేదా చెక్ చేయడానికి అనేక రకాల వత్తిడులను ఎదుర్కొనుచూ వుంటారు.
ఆధార్ అధీక్రుతము యొక్క ప్రధాన ఉద్దేశ్యము ఏమిటంటే ఆన్ లైన్ లో ఒక డిజిటల్ ప్లాట్ ఫారం లో ఆధార్ గ్రహీతల గుర్తింపును ఎక్కడైనా ఎప్పుడైనా ద్రువీకరించే వీలు కల్పించాలి.
యు.ఐ.డి.ఎ.ఐ ఆధార్ ఆధారిత గుర్తింపును కోరుకొనే సంస్థలకు ( ప్రభుత్వ/సామాజిక మరియు ప్రైవేటు సంస్థలు/ఏజెన్సీస్ )ఈ సదుపాయాన్ని అందిస్తుంది. యు.ఐ.డి.ఎ.ఐ అందించే ఈ సేవలను ప్రభుత్వ/సామాజిక మరియు ప్రైవేటు సంస్థలు/ఏజెన్సీస్ వారి యొక్క కస్టమర్స్ ను మరియు ఉద్యోగులు/ఇతర సంభందిత సిబ్బంది గుర్తింపును ధ్రువీకరించడానికి ఉపయోగిస్తారు( ముందుగా వారి వ్యక్తిగత సమాచారము) రూడి అయిన తర్వాత మాత్రమే వారికి కన్స్యూమర్ సేవలు/ సబ్సిడీలు/ప్రయోజనాలు/వ్యాపార ప్రయోజనాలు/ ఆవరణ అనుమతులు జరుగుతాయి
అధీకృత విధానాలు. —
- అథారిటీ నియమించిన లేక పొందుపరచిన సూత్రాలు లేక ఆదేశాలు కు లోబడిన సంస్థలు ఎలక్ట్రానిక్ రూపములో పంపిన అభ్యర్ధనలను మాత్రమే అథారిటీ పరిగణలోనికి తీసుకుంటుంది లేక స్వీకరిస్తుంది.
- అధీకృతము ఈ క్రింది విధములుగా జరుపుతారు :
-
- డెమోగ్రాఫిక్ అధీక్రుతము: ఆధార్ గ్రహీత నుండి పొందిన ఆధార్ నెంబర్ మరియు డెమోగ్రాఫిక్ సమాచారము సి.ఐ.డి.ఆర్ లో వున్న ఆధార్ గ్రహీత యొక్క నెంబర్ మరియు డెమోగ్రాఫిక్ సమాచారముతో సరిపోల్చడము.
- ఒక సారి పొందే పాస్ వర్డ్ ద్వారా అధీక్రుతము: ఈ-మెయిల్ గానీ మొబైల్ నెంబర్ గానీ అథారిటీ తో రిజిస్టర్ చేసిన ఆధార్ గ్రహీత యొక్క మొబైల్ కు గానీ లేక ఈ-మెయిల్ కు గానీ కొద్ది సేపు విలువ కలిగి వుండే ఒ.టి.పి ను పంపి అధీక్రుతము చేయుట. ఈ అధీకృత విధానములో నివాసి చెప్పిన ఒ.టి.పి/ ఆధార్ నెంబర్ మరియు అథారిటీ పంపిన ఒ.టి.పి/ఆధార్ నెంబర్ రెండూ సరిపోలబడాలి.
- బయో-మెట్రిక్ ఆధారిత అధీక్రుతము: సి.ఐ.డి.ఆర్ లో దాచబడిన వ్యక్తికి సంభందిoచిన బయోమెట్రిక్ సమాచారము , నివాసి అందించిన ఆధార్ నెంబర్ మరియు బయోమెట్రిక్ సమాచారము తో సరిపోల్చి అధీక్రుతము చేయుట. ఈ విధానము వ్రేలి ముద్రల ఆధారముగా గానీ లేక ఐరిస్ ద్వారా చేసే అధీక్రుతము గానీ లేక బయోమెట్రిక్ సమాచారము ప్రకారము చేసే ఇతర బయోమెట్రిక్ అధీక్రుతము గానీ కావచ్చు.
- మల్టీ-ఫాక్టర్ అధీక్రుతము: పైన పేర్కొన్న రెండూ లేక ఎక్కువ పద్ధతుల ద్వారా చేసే అధీక్రుతము మల్టీ-ఫాక్టర్ అధీక్రుతము గా పిలుస్తారు.
- అధీక్రుతాన్ని కోరే సంస్థ వీలుని బట్టి సబ్-రెగ్యులేషన్ లో పొందు పరచిన ఏదైనా ఒక అధీకృత విధానాన్ని గానీ లేక మరి ఎక్కువ భద్రతా కారణాల రీత్యా మల్టీ-ఫాక్టర్ అధీక్రుతాన్ని కూడా ఎంచుకోవచ్చు. సంశయ నివృత్తి కొరకు చెప్పేదేమంటే ఒ.టి.పి/ మరియు బయోమెట్రిక్ అధీక్రుతము ద్వారా మాత్రమే ఈ-కె.వై.సి అధీక్రుతము జరుపుతారు.
అధీక్రుతము కొరకు ఆధార్ గ్రహీత యొక్క అనుమతి కోరుట
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యక్తి సబిస్డి, సేవ, ప్రయోజనము పొందేందుకు వీలుగా ఆ వ్యక్తి యొక్క గుర్తింపును ధృవీకరించడo తప్పనిసరియైన పరిస్థితులలో, అధీక్రుతము పొందుట గానీ, ఆధార్ నెంబర్ వుంది అనే దానికి ధృవీకరణగా నకలు చూపించుట, లేక ఆధార్ నెంబర్ లేని నివాసికి ఆధార్ నెంబర్ కు అప్లై చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం గానీ అధీక్రుతము ద్వారానే జరుగుతాయి. ఆధార్ నెంబర్ లేని నివాసికి/వ్యక్తికి సబ్సిడీ ఇవ్వడం గానీ/ ప్రయోజనం/సేవ అందిచడము గానీ చేయడానికి వేరే ఇతరత్రా గుర్తింపును ధృవీకరించే మార్గాన్ని వెతకాలి.
ఆధార్ ఆక్ట్ లో భాగస్వాములైన మరియు ఆధార్ ఆక్ట్ తో ఒడంబడిక ను పొందిన అన్నీ సంస్థలు చేయవలసినదేమంటే –
- ఆధార్ ఆక్ట్ లో చెప్పే వరకూ, నివాసి(అతను/ఆమె) యొక్క సమాచారాన్ని అధీక్రుతము నిమిత్తము వాడుకొనేందుకు ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి
- ఆ వ్యక్తిగత సమాచారము కేవలము సి.ఐ.డి.ఆర్ కు అధీక్రుతము నిమిత్తము మాత్రమే ఉపయోగిస్తారని భరోసా ఇవ్వాలి
రాష్ట్రము గానీ, కార్పొరేట్ బాడీ గానీ, వ్యక్తి గానీ, ఇప్పుడు అమలులో వున్న చట్టము ప్రకారము కేవలము ఆధార్ నెంబర్ ను గుర్తింపును రూడి పరచడానికి మాత్రమే ఉపయోగించాలనేదీ నిస్సందేహము.
ఆధార్ ఆక్ట్ లో భాగస్వాములైన మరియు ఆధార్ ఆక్ట్ తో ఒడంబడిక ను పొందిన అన్నీ సంస్థలు చేయవలసినదేమంటే
అధీకృత సేవలు
ఈ అధీకృత సేవలు యు.ఐ.డి.ఎ.ఐ నిర్వహించే రెండు డేటా కేంద్రముల ద్వారా ఐ.ఈ., హేబ్బాల్ డేటా కేంద్రము(హెచ్.డి.సి) మరియు మానేసార్ డేటా కేంద్రము(ఎమ్.డి.సి) ద్వారా ఆన్ లైన్ లో రియల్ టైం పద్ధతిలో నిర్వహించబడుతూ మరియు ఈ-కె.వై.సి మొదలగు ఇతర సేవల విషయంలో కూడా అతి వేగముగా అందే విధముగా ఆక్టివ్-ఆక్టివ్ మోడ్ లో అందించబడతాయి.
అధీకృత సేవల డిమాండ్ పెరిగే కొలదీ ప్రస్తుతము యు.ఐ.డి.ఎ.ఐ కేంద్ర గుర్తింపు డేటా రిపోజిటరీ ద్వారా అందించబడే పది మిలియన్ల అధీక్రుతము యొక్క సామర్ధ్యము గణనీయంగా పెంచబడుతుంది. ఆధార్ సేవలు అందిoచే అనేక సంస్థలు వారి యొక్క ముఖ్య కార్యకలాపాల డొమైన్ అప్లికేషన్స్ లోనికి ఆధార్ ను అనుసంధానము చేసిదేశములో ఎక్కడైనా రియల్ టైం లో, మరియు సామర్ధ్యాన్ని పెంపోదించే విధముగా సిద్ధపడి వున్నారు.