Authentication User Agencies
ఉపోద్గాతము
ఎ.ఎస్.ఎ లు యు.ఐ.డి.ఎ.ఐ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము సి.ఐ.డి.ఆర్ తో లీసేడ్ లైన్ అనుసంధాన్ని కలిగి వుంటాయి. ఎ.ఎస్.ఎ లు యు.ఐ.డి.ఎ.ఐ తో అనుసంధానము చేసిన నెట్వర్క్ ను ఎ.యు.ఎ./కె.యు.ఎ లాంటి విజ్ఞప్తి సంస్థలకు సేవలు అందిస్తూ వుంటాయి మరియు వాటి అధీకృత సేవల అభ్యర్ధనలను సి.ఐ.డి.ఆర్ కు చేరవేస్తాయి.
అధీకృత సేవల ఏజెన్సీల నియామకము
- ఈ ప్రత్యేక ప్రయోజనము కోరే సంస్థలు అథారిటీ నియమించిన విధానము ప్రకారము అధీకృత సేవల ఏజెన్సీలు అథారిటీ యొక్క అనుమతి కోరాలి.షెడ్యూల్ “ బి” లో పొందుపరచిన అర్హతా ప్రమాణాల పరిధి లోనీ సంస్థలు మాత్రమే అర్హులు. అర్హతా ప్రమాణాలను అథారిటీ సమయానుకూలముగా ఒక ఆర్డర్ ద్వారా మార్చే అవకాశముంది.
- అధీకృత సేవల ఏజెన్సీస్ నుండి అథారిటీ వేరే అధిక సమాచారము మరియు ఇచ్చిన సమాచారముపై వివరణలు కోరవచ్చు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో అప్లికేషను అంగీకరించడానికి మరియు తిప్పివేయడానికి కూడా అధిక సమాచారము అవసరముంటుంది.
- అథారిటీ ఇచ్చిన గడువు లోపులో అథారిటీ అడిగిన మేరకు అభ్యర్ది సమాచారాన్ని మరియు వివరణను అథారిటీ కు సంతృప్తి మేరకు అందించాల్సి వుంటుంది.
- అప్లికేషను ఆమోదించే సమయము లో, అప్లికేషను తో పాటు అభ్యర్ధి ఇచ్చిన సమాచారాన్ని( డాక్యుమెంట్స్ , మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరమైన వెసులుబాటు, వుండాల్సిన రీతిలో వుందో లేదో బౌతికంగా అథారిటీ చెక్ చేసుకొనే అవకాశముంది.
- అభ్యర్ధి అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారము, అర్హతలను బట్టి అథారిటీ ఈ క్రింది నిర్ణయాలలో ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవచ్చు:
ఎ). అధీకృత సర్వీస్ ఏజెన్సీ గా అభ్యర్ధిని ఆమోదించవచ్చు
బి). ఆ సం స్థతో లేక ఏజెన్సీ తో పూర్తి నియమ నిభందనలు వున్న ఒడంబడికను చేసుకోవచ్చు. వ్యతిరేకమైన లేక సరిగా నడిపించలేక పోవడం వలన నష్టాన్ని కలిగించే విషయాలు కూడా కాంట్రాక్టు పరిధి లోనికి తీసుకుంటారు. - అప్పుడప్పుడు అథారిటీ కు సర్వీస్ ఏజెన్సీ కట్టాల్సిన ఫీ, వార్షిక రుసుము, మరియు ప్రతీ ఒక్క లావాదేవీకు వసూలు చెయ్యాల్సిన ఫీ కూడా అనుమతి ఇచ్చేటప్పుడు నిర్ణయిస్తారు మరియు రుసుము లో మార్పులు వచ్చినప్పుడు కూడా సేవ ఏజెన్సీ అనుసరించాల్సి వుంటుంది.
ఎ.ఎస్.ఎ భాద్యతలు మరియు డేటా భద్రతా ప్రమాణాలు:
ఎ.ఎస్.ఎ భాద్యతలు మరియు డేటా భద్రతా ప్రమాణాలు వివరముల విషయమై ఆధార్ ఆక్ట్ 2016 చూడవలెనని మనవి.