ఫైనాన్సు మరియు బడ్జెట్

ఫైనాన్సు మరియు బడ్జెట్

యు.ఐ.డి.ఎ.ఐ ద్రవ్య విభాగం

ద్రవ్య విభాగం (FD) యు.ఐ.డి.ఎ.ఐ లో ఆర్థిక సలహాదారుగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫైనాన్స్) నేతృత్వంలో పనిచేస్తుంది. డీజీ అండ్ ఎండీకి ద్రవ్య సంబంధిత వ్యవహారాలన్నిటిలోనూ డైరెక్టర్ జనరల్ అండ్ మిషన్ డైరెక్ట‌ర్‌కు (డి.జి అండ్ ఎం.డి) ఈ విభాగం వృత్యంతర సలహాలిస్తుంది. .

ద్రవ్య నిర్వహణ అంచనా (Budget) రూపకల్పన, బడ్జెట్ ఫలితాలు, పనితీరు, వ్యయాలు- నగదు నిర్వహణ, ద్రవ్య సంబంధ వ్యవహార సంబంధింత ప్రతిపాదనల నిశిత పరిశీలన వంటి బాధ్యతలను ఈ విభాగం నిర్వర్తిస్తుంది.

యు.ఐ.డి.ఎ.ఐ ద్రవ్య విభాగం పాత్ర

ఆర్థికపరమైన సలహాలు/ఏకీభావం

  • ఆర్థికపరమైన అంశాల సవ్య మదింపు దిశగా విధాన - కార్యక్రమ కార్యకలాపాలలో సహాయపడటం;;
  • మంత్రిమండలి/ ఈఎఫ్‌సీ/ఎస్ఎఫ్‌సీ ప్రతిపాదనలపై సలహాలు, వ్యయ అంచనాల సవరణ ప్రతిపాదనలు;
  • ఆర్థికాధికారాల అప్పగింతపై సలహాలు;
  • సీఎఫ్ఏ సంబంధిత అవసరార్థ సమ్మతి (AON), వ్యయకోణంలో మంజూరు (EAS) తదితర ప్రభుత్వ వ్యయాలు/సమ్మతి వంటి ద్రవ్య ప్రతిపాదన వ్యవహారాలపై సలహాలు;
  • నియమనిబంధనలు, కార్యకలాపాల అవసరాల కోణంలో తగిన శ్రద్ధతో ప్రతిపాదనలపై అంచనా, నిర్ధారణ;
  • ఆర్థిక కోణంలో టెండర్/RFP పత్రాలు, సవరణలుసహా కాంట్రాక్టులపై సునిశిత పరిశీలన;
  • వివిధ కమిటీలలో ఆర్థిక ప్రతినిధి నియామకం లేదా భాగస్వామ్యం (CAB, టెండర్ల పరిశీలన/నిర్ధారణ, వాణిజ్య సంప్రదింపులు, ఇతర కమిటీలు);
  • కొనుగోలు నిబంధనావళిద్వారా అంతర్గత నియంత్రణ వ్యవస్థలు... వివిధ కొనుగోళ్లు, కాంట్రాక్టులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమనిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాగే విధంగా జాగరూకత వహించడం.

బడ్జెట్ తయారీ

  • బడ్జెట్ తయారీ, సంబంధిత కార్యకలాపాలు (అంచనాల రూపకల్పన, సవరించిన అంచనాలు, అనుబంధ మంజూరులు);
  • ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు; తుది అవసరాలపై అంచనాల తయారీ, సకాలంలో పొదుపు మొత్తపు అప్పగింత, పునఃకేటాయింపు;
  • ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటు స్థాయి సంఘం, UIDAI సంబంధిత అంశాల పనులు

బడ్జెట్ తయారీ

  • మంజూరు నిధుల వ్యయం సాగే తీరుపై నెలవారీగా పర్యవేక్షణ, సమీక్ష;
  • పొదుపు, వ్యయంలో హేతుబద్ధీకరణలో వ్యయ విభాగం జారీచేసిన నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ;
  • చెల్లింపులు, ఖాతాల కార్యాలయాల పనిపై పర్యవేక్షణ

అంతర్గత తనిఖీ

  • అంతర్గత తనిఖీ ప్రణాళిక రూపకల్పన (HQ లో నాలుగు నెలలకోసారి, విధుల నిర్వహణ విభాగాలుసహా, ROలు/సాంకేతిక కేంద్రాలలో ఏడాదికోసారి), దీని అమలు కోసం మానవ వనరుల కేటాయింపు;
  • ఖరారు చేసిన అంతర్గత తనిఖీ నివేదికను సంబంధిత విభాగం/ROలు, సాంకేతిక కేంద్రాలకు పంపడం;
  • అంతర్గత తనిఖీలో లేవనెత్తిన అంశాలపై తదుపరి చర్యల పర్యవేక్షణ

ఇతర కార్యకలాపాలు

  • UIDAIకి సంబంధించి CAG/PAC/Audit ఉటంకింపుల పరిశీలన;
  • జవాబుల పరిశీలన/న్యూఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ సీఈ కార్యాలయ తనిఖీ సారాంశానికి విధి నిర్వహణ విభాగాల అనుసరణ
  • CAG ఉటంకింపులపై తీసుకున్న చర్యల నివేదిక తయారీ
  • వార్షిక నివేదికలు, ఆర్థిక అధ్యయనం, ప్రధానమంత్రి కార్యాలయ (PMO)నెలవారీ నివేదిక తయారీకి సమాచార సహకారం; UIDAI అధికారులను విదేశాలకు పంపడంపై నిశిత పరీక్ష-సమ్మతుల పరిశీలన

Budget and Expenditure

Budget and Expenditure of UIDAI since its inception in 2009:

$Excess expenditure met from unspent grant of 2018-19
*Excess expenditure met from unspent grant of 2018-19 & 2019-20 and UIDAI Fund
**Including Rs. 680 crore received as third and final supplementary grant
@Expenditure upto February 2023

To efficiently discharge our responsibility, we are guided by the following publications:

  • General Financial Rules, 2005
  • UIDAI Procurement Manual
  • Delegation of Financial Powers Rules (DFPR)
  • Other instructions issued by the Ministry of Finance, CVC, etc.

సంగ్రహరూప రేఖాచిత్రం

ప్యూటీ డైరెక్టర్ జనరల్ (ద్రవ్య విభాగం)కు కింది సిబ్బంది బృందం సహకరిస్తుంది:

organizational chart

UIDAI Summarised Financial Position as on 28th February, 2023

31- Grants in Aid: General

882.00

882.00

1013.41

98.04

1111.45

126.01%

35- Grants for creation of capital assets

175.00

175.00

120.94

35.88

156.82

89.61%

36- Grants-in-aid salaries

53.00

53.00

53.43

3.71

57.14

107.81%

Total

1110.00

1110.00

1187.78

137.63

1325.41

119.41%