ఆధార్ లోగో

భావన మరియు లోగో:

పూర్వము యు.ఐ.డి(విశిష్ట గుర్తింపు)గా ప్రాచుర్యం పొందిన విశిష్ట గుర్తింపు సంఖ్యకు బ్రాండ్ నేమ్( గుర్తింపు పేరు మరియు చిహ్నం). క్లుప్తంగా విశిష్ట గుర్తింపు సంఖ్యకు ఆధార్ అనేది ఒక గుర్తింపునిచ్చే పేరు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చేత ఇవ్వబోయే విశిష్ట సంఖ్యలకు ఈ పేరు చిహ్నాలను ఈ పథకం ద్వారా వచ్చే ప్రభావశీలమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది.

ఇలా ఈ రెండు కలిసి యు.ఐ.డి.ఎ.ఐ. ద్వారా అందించే విశిష్ట సంఖ్యల స్ఫూర్తి మరియు సారాన్ని అందిస్తాయి.నివాసుల డెమోగ్రఫిక్ మరియు బయోమెట్రిక్ సమాచారాలపై ఆధారపడి ప్రతి నివాసికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వడం అన్నది భారత విశిష్ట ప్రాధికార సంస్థ యొక్క లక్ష్యం. దీనిని నివాసులు తమ గుర్తింపుగా దేశంలో ఎక్కడైనా చూపించవచ్చు. అలాగే విశిష్ట గుర్తింపు ద్వారా లభించే ప్రయోజనాలను సేవలను పొందవచ్చు..

ఈ సంఖ్య (ఇప్పటివరకు విశిష్ట గుర్తింపుగా చెప్పినది) కు ఆధార్‌గా పేరు పెట్టడం జరిగింది. "ఆధారమైనది" లేదా "బలపరిచేది" అని దీని అర్థం. ఈ మాట చాలా భారతీయ భాషలలో ఉంది. అందువల్ల దేశ వ్యాప్తంగా అమలులో ఉండే యు.ఐ.డిఎ.ఐ పథకానికి ఈ మాట ఒక గుర్తింపు పేరుగా వ్యాప్తిలోకి తేవడం జరిగింది. విశిష్ట మరియు కేంద్రీకృత హామీ వల్ల ఆధార్ యొక్క ఆన్‌లైన్ గుర్తింపు తనిఖీ ప్రజలకు వివిధ సేవలను అందించడానికి ఆధారం అవుతుంది. ఇది మార్కెట్ యంత్రాంగానికి గొప్ప అనుసంధాన కర్తగా పనిచేస్తుంది.

దేశంలోని ఏ ప్రాంతంనుంచైనా, ఏ సమయంలోనైనా వివిధ సేవలను, వనరులను పొందే శక్తిని ఆధార్ నివాసులకు ఇస్తుంది..

బ్రాండ్ మార్గదర్శకాలు:

ఆధార్ లోగో ఖచ్చితమైన చతురస్ర రూపంలో ఉండదు. లోగో యొక్క ఎత్తుకన్నా వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్‌ని అలాగే కాపాడడానికి ఈ లోగోను ఇలాగే ఖచ్చితమైన రూపంలో ప్రదర్శించడం ముఖ్యం. కింద ఇచ్చిన లోగో యొక్క పొడవు వెడల్పులు తదితర కొలతలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి. బ్రాండ్ మార్గదర్శకాలు:.

Aadhaar Logo