ఆపరేషన్ మోడల్
ఆధార్ ప్రమాణీకరణ పర్యావరణ వ్యవస్థలో భాగస్వాముల గురించి ఈ నిర్వహణ నమూనా రేఖామాత్రంగా వివరిస్తుంది. కింద ఇచ్చిన చిత్రం కీలక భాగస్వాముల గురించి తెలుపుతుంది. వీరు పరస్పరం సహకరించుకునే తీరును సమాచార ప్రవాహం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రక్రియలో వారికి సంబంధించిన సంక్షిప్త వివరణ, నేపథ్యాలను సూచిస్తుంది..
“UIDAI ” అందించే వివిధ రకాల ప్రమాణీకరణ సేవల జాబితాను “ఆధార్ ప్రమాణీకరణ చట్రం”పై ఇచ్చిన పత్రంలో వివరించింది. ఆయా సంస్థలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆధార్ ప్రమాణీకరణద్వారా ఏ రకం సేవలు కావాలో ఎంచుకోవచ్చు..
ఆధార్ ప్రమాణీకరణ పర్యావరణ వ్యవస్థలో భాగస్వాములు
విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI):ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. దీన్నే UIDAIగా వ్యవహరిస్తారు. ఆధార్ చట్టం-2016 కింద ఆధార్ నమోదు ప్రక్రియ, ప్రమాణీకరణ విధులను ఇది నిర్వర్తిస్తుంది. ఆధార్ ప్రమాణీకరణ వ్యవస్థ నియంత్రణ, పర్యవేక్షణలు పూర్తిగా ఈ సంస్థ పరిధిలోనే ఉంటాయి. ఆధార్ సంఖ్యదారుల వ్యక్తిగత గుర్తింపు సమాచారం (PID) నిల్వచేసిన కేంద్ర గుర్తింపు సమాచార భాండాగారం (CIDR) యాజమాన్యం, నిర్వహణ పూర్తిగా ఈ సంస్థ అధికార పరిధిలోనే ఉంటాయి
ప్రమాణీకరణ సేవా సంస్థ (ASA): : ఇవి UIDAI ప్రమాణాలు, నిర్దేశాలకు లోబడి లీజు పొందిన సురక్షిత లైన్ ద‌్వారా సిఐడిఆర్‌తో అనుసంధానతగల ఏజెన్సీలు. ఈ అనుసంధానతను ప్రమాణీకరణ వినియోగ సంస్థ (AUA)లకు ఒక సేవగా అందిస్తూ వాటి ప్రమాణీకరణ విజ్ఞప్తులను సిఐడిఆర్‌కు బదిలీ చేస్తుంది. యూఐడీఏఐతో అధికారిక ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ASAలుగా వ్యవహరిస్తాయి. ఇతర ఏ సంస్థలూ సిఐడిఆర్‌తో నేరుగా సంబంధం నెలకొల్పుకోలేవు. ఒక ASA అనేక AUAలకు సేవలందించగలదు. బహుళపక్ష ప్రమాణీకరణ, అధీకృత, సేవా నిర్వహణ నివేదికలు వంటి విలువ ఆధారిత సేవలను కూడా ASA అందించగలదు..
ప్రమాణీకరణ వినియోగ సంస్థ (AUA): : ఆధార్ ప్రమాణీకరణ సేవను వినియోగించుకునే వివిధ సేవాల సంస్థలు. ఇవి ASAద్వారా CIDRతో అనుసంధానం కలిగి ఉంటాయి. ఇవి ఒకటికన్నా ఎక్కువ ASAలతో సంబంధాలు నెరపవచ్చు. ఉప AUAల నుంచి వచ్చే ప్రమాణీకరణ విజ్ఞప్తులను కూడా AUAలు ప్రసారం (దిగువ ఇచ్చిన ఉప AUAలలో దీన్ని చూడొచ్చు) చేయవచ్చు. ఉప AUAలకు ప్రమాణీకరణ సేవలందించే సముదాయంగా AUAలు వ్యవహరించవచ్చు. అలాగే బహుళపక్ష ప్రమాణీకరణ, అధీకృత, సేవా నిర్వహణ నివేదికలు వంటి విలువ ఆధారిత సేవలను కూడా ఉప AUAలకు అందించవచ్చు. AUAలు కూడా UIDAIతో అధికారిక ఒప్పందం చేసుకుంటాయి.
ఉప వినియోగ సంస్థ (Sub AUA): ఏదైనా (దేశంలో చట్టబద్ధంగా నమోదైన) సంస్థ తన సేవలకు ఆధార్ ప్రమాణీకరణను వినియోగించుకోవాలని భావిస్తే ప్రస్తుత AUAలద్వారా ఆ సేవను పొందవచ్చు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణను దిగువన చూడవచ్చు:
- I. రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలేవైనా AUAలు కావచ్చు. వివిధ మంత్రిత్వ శాఖలు ఉప AUAలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రమాణీకరణ సేవలు పొందవచ్చు.
- II. ఓ చిన్న వ్యాపారం (చిన్నతరహా బ్యాంకు) వంటిది నిర్వహించే సంస్థ ఆధార్ ప్రమాణీకరణను కోరుకుంటున్నా UIDAIతో అధికారిక ఒప్పందం వద్దనుకుంటే ప్రస్తుత AUA (పెద్ద బ్యాంకు లేదా ఏయూఏ సేవలందించే సముదాయ సంస్థ) పరిధిలోని ఉప AUAగా ఆ సేవలను పొందవచ్చు
- III. వ్యాపార కారణాలరీత్యా అనేక సంస్థలన్నీ కలిసి ఒక పెద్ద AUAకింద... ఉదాహరణకు చిన్న హోటళ్లన్నీ కలిసి హోటళ్ల అసోసియేషన్ ఉప AUAలుగా ఆధార్ ప్రమాణీకరణ సేవలు పొందవచ్చు.
UIDAIతో ప్రత్యక్ష ఒప్పంద బంధమేదీ ఈ ఉప AUAలకు ఉండదు. వీటినుంచి వచ్చేవిసహా అన్ని ప్రమాణీకరణ విజ్ఞప్తుల ప్రవాహ మార్గాలుగా ఉన్న AUAలు మాత్రమే ఇలాంటి ఒప్పందం కలిగి ఉంటాయి. అయితే, ఉప AUAలతో ఒప్పంద పత్రం నకలును UIDAIకి AUAలు పంపాలి. వాటి వ్యాపార పరిధి, వివరాలు, సంకేతాలు వంటివన్నీ పంచుకోవాలి.
విజ్ఞప్తులు పంపే సంస్థలు: వ్యక్తుల ఆధార్ సంఖ్య, జనసంఖ్యసంబంధ, జీవసంబంధ సమాచారాన్ని సిఐడిఆర్‌కు పంపి ప్రమాణీకరణ కోరే సంస్థలను విజ్ఞప్తులు పంపేవ సంస్థలుగా వ్యవహరిస్తారు.
ప్రమాణీకరణ పరికరాలు: ఆధార్ సంఖ్యదారుల నుంచి వ్యక్తిగత గుర్తింపు సమాచారం (PID) సేకరణ, దాన్ని భద్రపరచడం, ప్రమాణీకరణ ప్యాకెట్ల ప్రసారం, ఫలితాల స్వీకరణకు వీటిని ఉపయోగిస్తారు. ఏయూఏ/ఉప ఏయూఏలు వినియోగించే, నిర్వహించే కంప్యూటర్లు, కేంద్రాలు, అరచేతి పరికరాలు వంటివి ఇందుకు ఉదాహరణలు.
ఆధార్ సంఖ్యదారులు: ఆధార్ చట్టం-2016 ప్రకారం విశిష్ట గుర్తింపు (ఆధార్ ) సంఖ్య పొందినవారు. AUAల సేవల కోసం తమ గుర్తింపు ప్రమాణీకరణను వారు కోరుతారు. కీలక భాగస్వాములంతా పలురకాలుగా ఒకరితో మరొకరు వ్యవహారాలు నడుపుతారు. ఉదాహరణకు ఒక ఏయూఏ తనకు తానే ఏఎస్ఏ కావాలని కోరుకోవచ్చు. వ్యాపార నిరంతరత కారణాలవంటి నేపథ్యంలో ఒక ఏయూఏ పలు ఏఎస్ఏలద్వారా ఆధార్ ప్రమాణీకరణ కోరవచ్చు. అలాగే ఒక ఏయూఏ తన ప్రమాణీకరణ నిర్ధారణ వినతులను స్వీయ బట్వాడా కోసం, బహుళ సబ్ ఏయూఏల కోసం ప్రసారం చేయవచ్చు.
ఆధార్ ప్రమాణీకరణ పర్యావరణ వ్యవస్థలో కీలక భాగస్వాములకు చెందిన మరిన్ని వివరాలు, వారి పాత్రలు, బాధ్యతలు, విధులు, అవి ఇతర పాత్రధారులతో వ్యవహరించే తీరు వగైరా సమాచారమంతా ఆధార్ ప్రమాణీకరణ నిర్వహణ నమూనాలో లభ్యమవుతుంది.
భా. వి. గు. ప్రా. సం. ఆధార్ ఆధీకృతాన్ని ఒక్కదానినే వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తుంది. లేక ఆధీకృత వినియోగ సంస్థలతో కలిసి వాడుకునే నిర్దేశిత అవకాశాన్ని ఇస్తుంది. (దీనినే "ఫెడరేటెడ్ ఆధీకృత" అంటున్నాం) ఉదాహరణకు ఫెడెరేటెడ్ ఆధీకృతంలో ఒక బ్యాంకు ఏ. టి. యం. కార్డును వేలిముద్రను ఆధీకృతానికి వాడినట్లయితే – ఏ. టి. యం. కార్డు ఆధీకృతం బ్యాంకు యొక్క అప్లికేషనుకు, వేలిముద్రల ఆధీకృతం గుర్తింపు సమాచార కేంద్ర నిధిలోని సమాచారంతో పోల్చుకొని అదే వ్యక్తి యొక్క ఆధార్ ఆధీకృతాన్ని తెలియజేస్తుంది.
Federated Model of Aadhaar Authentication Service
ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఎక్కువ శాతం ఆధీకృత పద్ధతులను "లోకల్" గానూ (-కు సంబంధించిన లేదా సేవలకు, సందర్భాలకు లేదా విలువలకు సంబంధించినదిగా ఉండడం) మరికొన్నింటిని "రివోకబుల్" గానూ వ్యవహరిస్తారు. (కొన్ని సంధర్భాలలో ఇప్పటికే ఉన్న గుర్తింపును తొలగించవచ్చు. తిరిగి కొత్త గుర్తింపును ఇవ్వవచ్చు. తుది గడువు అయిపోయిన సందర్భాలలోనూ లేదా ఇతర విలువైన కారణాలు ఉన్న సందర్భాలలో). ఆధార్ ఆధీకృత పద్ధతి, వేరొక సందర్భంలో, "గ్లోబల్" గానూ (ఎందువల్లనంటే ఇది ఆధీకృత వినియోగ సంస్థలు అందించే సేవలన్నింటిని పొందడంలో వినియోగించబడుతుంది కనుక) మరియు నాన్–రీవోకబుల్‌గానూ వ్యవహరించబడుతుంది. (ఎందువల్లనంటే ఆధార్ గుర్తింపుకు సంబంధించిన వేలిముద్రలు, హైరీస్‌స్కాన్ మొదలగునవి సాధారణంగా తొలగించడం, తొలగించిన స్థానంలో కొత్తవి చేర్చడం సాధారణంగా సాధ్యం కాదు కాబట్టి) ఫెడరేటెడ్ ఆధీకృత పద్ధతిలో, గ్లోబల్-ఇర్రివోకబుల్ ఆధార్ ఆధీకృతం కలిసి ఉంటుంది. మరియు ఆధీకృత వినియోగ సంస్థల యొక్క లోకల్-రివోకబుల్ ఆధీకృతాన్ని బలపరుస్తుంది. ఇటువంటి ఫెడరేటెడ్ పద్ధతి ఆధీకృత పద్ధతుల్లో బలీయమైన నమ్మశక్యమైన ఫలితాలను ఇస్తుంది. కేవలం గ్లోబల్-ఇర్రివోకబుల్ పద్ధతి లేదా లోకల్-రివోకబుల్ పద్ధతుల్లో ఏ ఒక్కదాని కన్నా ఫెడరేటెడ్ పద్ధతి మంచి ఫలితాలను ఇస్తుంది.
ఆధీకృత వినియోగ సంస్థల స్వీయ ఆధీకృతంలో ఫెడరేటెడ్ పద్ధతి తప్పనిసరి కానప్పుడు, లేదా తప్పనిసరిగా లేనప్పుడు అని (ఒకవేళ ఆధీకృత వినియోగ సంస్థ / ఉప ఆధీకృత వినియోగ సంస్థలు కావాలనుకుంటే వారు కేవలం ఆధార ఆధీకృతాన్ని మాత్రమే వాడుకోవచ్చు.) ఆధీకృత వినియోగ సంస్థలు / ఉప ఆధీకృత వినియోగ సంస్థలు తమ దగ్గర ఉన్న ఆధీకృత పద్ధతితో అనుసంధానించి వినియోగించుకోవాలి. ఇలా కలిపి ఆధీకృత ప్రక్రియను పరిశీలించడంద్వారా సమగ్ర ఆధీకృత పద్ధతి బలమైనదిగానూ, నమ్మశక్యమైనదిగానూ, ఆధారపడదగినదిగానూ తయారవుతుంది.
ఆన్‌లైన్ ఆధీకృతానికి నెట్‌వర్క్ అనుసంధానం తప్పనిసరిగా కావాలి. ఎక్కడైతే అనుసంధానిత వ్యవస్థలు అంతరాయలతోనూ లేదా కొంతదూరంలోనూ ఉంటాయో అటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి భా. వి. గు. ప్రా. సం. "బఫర్" అనే పరిష్కారాన్ని కనుగొంది. ఎక్కడైతే ఆధీకృత అభ్యర్థన ఒక పరికరంపై "బఫర్" చేయబడిందో దానికి ముందే నిర్దేశించిన 24 గంటల సమయం దాకా వేచి ఉండి తర్వాత అనుసంధాన వ్యవస్థ పునః స్థాపించబడినపుడు సమాచారాన్ని ఆధీకృతం కోసం గుర్తింపు సమాచార కేంద్ర నిధికి పంపబడుతుంది.
ఆధీకృత పరికరం ఒకటికిమించిన ఆధీకృత అభ్యర్థనలను ఒకే సమయంలో పంపినపుడు కూడా ఇవన్నీ బఫర్ చేయబడి అనుసంధానం పునః స్థాపించబడినపుడు అభ్యర్థనలు ఒకదానివెనుక ఒకటి పంపబడుతాయి. ఆధార్ ఆధీకృత వ్యవస్థలో ప్రతి అభ్యర్థన ఒక ప్రత్యేక లావాదేవిగా గుర్తించబడుతుంది. ఇంకా, ఇలా బఫర్ చేయడమన్నది పరికరంపై మాత్రమే జరగాలని భా. వి. గు. ప్రా. సం. భావిస్తుంది. అంతేగాని ఆధీకృత వినియోగ సంస్థలో గానీ / ఆధీకృత సేవా సంస్థల సర్వర్‌లపై గానీ బఫర్ చేయడానికి భా. వి. గు. ప్రా. సం. అంగీకరించదు..
For more information on Network Exception Handling, please refer “Buffer Authentication” section on Aadhaar Authentication Operating Model For Biometric Exception Handling, please refer “Biometric Exception Handling” section on Aadhaar Authentication Framework.
Aadhaar Authentication Offerings
ఇతర సాంకేతిక వ్యవస్థలలో వలెనే బయోమెట్రిక్ వ్యవస్థ కూడా కొన్ని పరిమితులను కలిగి ఉంది. బయోమెట్రిక్ ఆధీకృతాన్ని (వేలిముద్ర మరియు హైరీస్ రెండూ) వినియోగించుకోవడానికి తగిన విధంగా నమోదు కాని ప్రజలు కొద్ది సంఖ్యలో ఉంటారు. మరికొందరికి చేతివేళ్ళు ఉండవు. ఇంకొందరిలో చేతివేల్లపై ముద్రలు అథమ స్థాయి స్పష్టతను కలిగి ఉంటాయి. ఇటువంటి వారెవరు వేలిముద్రల ఆధారిత ఆధీకృతాన్ని వినియోగించుకోలేరు. దీనికి అదనంగా మరికొంత మందికి బయోమెట్రిక్ ఆధీకృతాన్ని వినియోగించుకోవడంలో తాత్కాలిక సమస్యలు ఎదురవ్వవచ్చు. చేతివేళ్ళు తెగడం / వేళ్ళు కాలి గాయాలవడం, అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల బయోమెట్రిక్ ఆధీకృతాన్ని కొందరు వినియోగించుకోలేరు
బయోమెట్రిక్ ఆధీకృతాన్ని తమ సేవలు అందించడానికి ఒక పద్ధతిగా ఎంచుకొనే ఆధీకృత వినియోగ సంస్థలను ఇతర ప్రత్యామ్నాయ ఆధీకృత పద్ధతులను ఎంచుకోవాల్సిందిగా భా. వి. గు. ప్రా. సం. సూచిస్తుంది. ఇది బయోమెట్రిక్ ఆధీకృతాన్ని వినియోగించుకోలేని నివాసులకు సేవలను అందించడంలో అంతరాయాలు లేకుండా చేస్తుంది. ఇటువంటి సందర్భాలలో ప్రత్యామ్నాయ బయోమెట్రిక్ పద్ధతులను గానీ, పదే పదే బయోమెట్రిక్ ఆధీకృతాన్ని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయడం గానీ, ఆపరేటర్ ఆధీకృతాన్ని ఇవ్వడం గానీ, డెమోగ్రఫిక్ సమాచారాన్ని వాడడం గానీ, ఒకసారి వినియోగించదగ్గ పాస్‌వర్డ్ ఆధారిత ఆధీకృతాన్ని వాడడంగానీ చేయవచ్చు. ఇవి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు మాత్రమే. బయోమెట్రిక్ మినహాయింపులను నిర్వహించడానికి ఫెడరేటెడ్ పద్ధతిని అనుసరించడం ఒక మంచి ప్రత్యామ్నాయంగా భా. వి. గు. ప్రా. సం. భావిస్తున్నది..
నెట్‌వర్క్ అపవాద నిర్వహణపై మరింత సమాచారం కోసం ఆధార్ ప్రమాణీకరణ నిర్వహణ నమూనాలోని “తటస్థ ప్రమాణీకరణ” విభాగాన్ని చూడగలరు. జీవ సంబంధ అపవాద నిర్వహణపై అయితే, ఆధార్ ప్రమాణీకరణ చట్రం విభాగంలోని సంబంధిత విభాగాన్ని గమనించగలరు.
దిగువ ఇచ్చిన రేఖాచిత్రంలో యూఏడీఏఐ అందించే వివిధ రకాల ఆధార్ ప్రమాణీకరణ సేవలను చూడవచ్చు:
: వివిధ సేవలందించే సంస్థలు ఆధార్ సంఖ్యదారు వ్యక్తిగత గుర్తింపు నిర్ధారణ కోసం వారి ఆధార్ సంఖ్య, జనసంఖ్య సంబంధ వివరాలను పోల్చి చూడటంద్వారా ఆధార్ ప్రమాణీకరణ వ్యవస్థను వినియోగించుకోవచ్చు. ప్రమాణీకరణ రకం 2: వివిధ సేవలందించే సంస్థలు యూఏడీఏఐలోని సిఐడిఆర్‌లో నమోదు చేసుకున్న మొబైల్ లేదా ఈమెయిల్‌కు పంపే ఒక్కసారి వినియోగించగల సంకేత పదం లేదా సంఖ్య ( OTP)ద్వారా ఆధార్ సంఖ్యదారు గుర్తింపు నిర్ధారణ కోరవచ్చు. టైపు-3 ఆధీకృతం: ఈ సేవ ద్వారా నివాసి యొక్క బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా-అంటే- ఐరీస్ లేదా వేలిముద్రల ఆధారంగా వివిధ సేవలను అందించే సంస్థలు నివాసిని / లబ్దిదారుని గుర్తిస్తాయి, ఆధీకృతం చేస్తాయి. టైపు-4 ఆధీకృతం: ఇది రెండు పద్ధతులో నివాసులను గుర్తిస్తుంది, ఆధీకృతం చేస్తుంది. మొదటిది- ఒకసారి ఇచ్చే పాస్‌వర్డ్ ద్వారా గుర్తించడం. రెండవది- బయోమెట్రిక్ (ఐరీస్ లేదా వేలిముద్ర)ల ద్వారా నివాసిని గుర్తించడం, ఆధీకృతం చేయడం. టైపు-5 ఆధీకృతం: సేవలను అందించే సంస్థలు నివాసిని అన్ని రకాలుగానూ గుర్తించడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఒకసారి వినియోగించే పాస్‌వర్డ్, వేలిముద్ర మరియు ఐరీస్ స్కాన్... మొదలైనవన్నీ తనిఖీ చేసి నివాసులను గుర్తిస్తుంది.
ఆధార్ సంఖ్య అన్ని రకాల ఆధీకృత పద్ధతులను విజయవంతంగా పూర్తి చేయగలిగేదై ఉండాలి. అందువల్లనే ఈ పద్ధతిని 1:1 పద్ధతికి కుదించడమైంది. ఆధార్ సంఖ్య దానంతట అదిగా ఆధీకృతం చేయగలుగుతుందని చెప్పలేం. పైన పేర్కొన్న టైపు-1 ఆధీకృతాన్ని ఇఅతరుల పద్ధతులలో ఎదో ఒక దానితో పోల్చి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సేవలను అందించే సంస్థలు తమ వ్యాపార అవసరంలో అనుగుణంగా ఉండే పై 5 రకాల ఆధీకృత పద్ధతులలో కొన్నింటిని ఎంచుకోవలసి ఉంటుంది. ఈ ఎంపికలో నివాసులకు కలిగే సౌకర్యం, సేవలను అందించే క్రమంలో నష్టం కలగకుండా చూడడం మొదలైన విషయాలను సంతులనం చేసుకోవాల్సి ఉంటుంది.