యు.ఐ.డి.ఎ.ఐ ఎకో సిస్టంస్

నమోదు – నవీకరణ పర్యావరణ వ్యవస్థ

నమోదు పర్యావరణ వ్యవస్థలో రిజిస్ట్రార్లు, నమోదు సంస్థలు భాగంగా ఉంటాయి. వ్యక్తుల నమోదుకు UIDAI గుర్తించిన సంస్థ లేదా వ్యవస్థ రిజిస్ట్రార్. నమోదు సంస్థలను రిజిస్ట్రార్లు నియమిస్తాయి. ధ్రువీకృత ఆపరేటర్లు/పర్యవేక్షకులను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ సమయంలో వ్యక్తుల జనసంఖ్య సంబంధ, జీవ సంబంధ సమాచారం సేకరించడం ఈ సంస్థల బాధ్యత.

రిజిస్ట్రార్లతో సమన్వయంలో నమోదు సంస్థలు నివాసులకు అందుబాటులో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. సమాచార సేకరణ కోసం STQC, UIDAI ధ్రువీకరణ పొందిన వేలిముద్రలు, కనుపాపల శోధకా(scanner)లు, కెమెరాలను ఇవి ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటినీ UIDAI రూపొందించిన ప్రమాణీకృత కార్యక్రమ సమన్వయ ప్రాదేశికం (API)తో అనుసంధానం కావాలి. రిజిస్ట్రార్లు, నమోదు సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదాతలను బహుళ సంఖ్యలో నియమించడంవల్ల ఈ పర్యావరణ వ్యవస్థలో ఆరోగ్యకర పోటీతత్వం ఏర్పడుతుంది. నివాసులు తమ సమాచారంలోని చిరునామా మార్పు, మొబైల్ ఫోన్ నంబరు, ఈమెయిల్ చిరునామా వగైరాలను శాశ్వత నమోదు కేంద్రా (PEC)లలో లేదా వెబ్‌ సైట్‌ద్వారా లేదా పోస్టుద్వారా నవీకరించుకోవచ్చు.

UID ప్రమాణీకరణ పర్యావరణ వ్యవస్థ

నివాసుల తక్షణ ప్రమాణీకరణ కోసం మార్పుచేర్పులకు అనువైన పర్యావరణ వ్యవస్థను UIDAI ఏర్పాటు చేసింది. ఆధార్ ప్రమాణీకరణ వ్యవస్థ నిత్య ప్రాతిపదికన కోట్లకొద్దీ ప్రమాణీకరణలను నిర్వహించగలదు. అంతేకాదు అవసరాన్నిబట్టి మరింత విస్తరించేందుకు అనువుగానూ ఉంటుంది. ఈ దిశగా పెద్దసంఖ్యలో ప్రమాణీకరణ సంస్థ (ASA)లను UIDAI ఏర్పాటు చేసింది. ఈ సంస్థలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను ప్రమాణీకరణ వినియోగ సంస్థ (AUA)లుగా నియమించాయి. అలాగే STQC భాగస్వామ్యంతో జీవసంబంధ సమాచార సేకరణ పరికరాలకు UIDAI సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించి, అనేక పరికరాలకు ధృవీకరణ ఇచ్చింది.

ప్రమాణీకరణ సేవను ఆన్‌లైన్‌లోనూ, వాస్త‌విక స‌మ‌యం విధానంలోనూ అందిస్తున్నందున రెండు సమాచార కేంద్రాలను UIDAI ఏర్పాటు చేసింది. ప్రమాణీకరణతోపాటు ఆన్‌లైన్‌ ఈ-కేవైసీ వంటి సేవలను తక్షణ-తక్షణ పద్ధతిలో అందించడం, అత్యున్నత స్థాయిలో అందుబాటులో ఉండటం ఈ కేంద్రాల ఏర్పాటు పరమోద్దేశం. ఆధార్‌ ప్రమాణీకరణను సూక్ష్మ ఎ.టి.ఎంలలోనూ నిక్షిప్తం చేసినందువల్ల శాఖలతో నిమిత్తం లేకుండా బ్యాంకులు, చెల్లింపుల వ్యవస్థలు దేశంలో ఎక్కడైనా వాస్తవిక సమయంలో, విస్తృత-అంతర నిర్వహణ విధానంతో సేవలందించవచ్చు..