సమాచార హక్కు

భారతప్రభుత్వం తన దేశపౌరులకు తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన సమాచారాన్ని పూర్తిగా తెలియజెప్పే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం 2005ను చేసింది. ఇది వ్యవస్థలలో పారదర్శకతను, బాధ్యతను పెంచడానికి సహకరించగలదని ప్రభుత్వం భావించింది. .

సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి?

ప్రభుత్వరంగ సంస్థలు తమ ఆధీనంలో ఉన్న ఏ సమాచారాన్నయినా ఏ పౌరుడైనా చూసుకోవడానికి ఆర్. టి. ఐ. వీలు కల్పిస్తుంది. ఇది వ్యవస్థల పనితీరును తనిఖీ చేయడానికి, పత్రాలు, రికార్డులు మొదలైనవి తనిఖీ చేసి నోట్సు రాసుకోవడానికి, వివిధ పత్రాలను/ రికార్డులను సర్టిఫైడ్ కాపీలుగా పొందడానికి, ఎలక్ట్రానిక్ రూపంలో నిలువ చేయబడ్డ సమాచారాన్ని, వనరుల నకళ్ళను పొందడానికి అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తునుఆన్ లైన్లో పంపించవలసిన ఈ-మెయిల్ rtionline.gov.in.

ఎవరు సమాచారాన్ని అడగవచ్చు?

భారతదేశంలో నివసించే ఏ నివాసియైనా నిర్ణీత రుసుముతో కూడిన దరఖాస్తును ఇంగ్లీషు/ హింది/ అధికారభాష దేనిలోనైనా కోరుకున్న సమాచారాన్ని పొందవచ్చు.

ఎవరు సమాచారాన్ని ఇస్తారు?

ప్రతి ప్రభుత్వసంస్థ ప్రజలనుంచి అభ్యర్థనను అందుకోవడానికి వీలుగా సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్లను వివిధ స్థాయులలో బాధ్యతాయుతులను చేయాలి. ఇలా నియమించబడ్డ సెంట్రల్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అభ్యర్థన దరఖాస్తు అందిన తరువాత 30 రోజుల లోపు దరఖాస్తులో కోరిన విధంగా సమాచారాన్ని దరఖాస్తుదారునికి అందించాలి లేదా ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్న కారణాలను పేర్కొంటూ తిరస్కరించాలి.

సమాచారాన్ని తెలపడంలో మినహాయింపులు (సెక్షన్ 8(1) (J)ఆఫ్ ఆర్. టి. ఐ. యాక్ట్ 2005)

ఈ విభాగం ఈ చట్టంలో పేర్కొనబడిన ఏ సమారాచాన్నయినా పౌరులకు అందించవచ్చునని చెబుతుంది. వ్యక్తుల వ్యక్తిగత వివరాలు, ప్రజాకార్యకలాపాలు లేదా ప్రజాప్రయోజనంలేని అంశాలతో కూడుకున్న అభ్యర్థనలు వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించని అంశాలు మొదలైన సమాచారాన్ని పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్లు పౌరులకు అందించవచ్చు..

యు. ఐ. డి. ఎ. ఐ. సమాచారం ఇచ్చే నియమావళి ఏం చెబుతుందంటే::

ఆర్. టి. ఐ. యాక్ట్ 2005లోని సెక్షన్ 8(1)(జె) ప్రకారం, ఒక వ్యక్తికి సంబధించిన డెమోగ్రఫిక్ మరియు బయోమెట్రిక్ సమాచారం అతను / ఆమె కోరినపుడు మాత్రమే అందించాలి. ఇతర అభ్యర్థులు ఈ సమాచారాన్ని కోరకూడదు. ఇతర నివాసులకుగానీ, థర్డ్ పార్టీ అభ్యర్థనలుగానీ ఈ చట్టంద్వారా స్వీకరించబడవు. ఆధార్ పథకం కింద నమోదైన నివాసుల స్వీయ సమాచారం కోరే అభ్యర్థులు కూడా తమ అభ్యర్థనలతోపాటు తమ గుర్తింపును ఋజువు చేయకోవలసి ఉంటుంది.

నివాసి తన నమోదు, తన వివరాలు ప్రాసెసింగ్ స్థాయి ఆధార్ నంబరు, ఆధార్ సంఖ్య బట్వడా మరియు అందుకోవడం... మొదలైన సమాచారాలను కోరడం

నివాసి తన వద్ద ఉన్న ఈ- ఐ. డి. సంఖ్యను తెలియజేస్తూ ఆధార్ ఉత్పత్తి/ సంఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని భా. వి. గు. ప్రా. సం. వెబ్‌సైట్‌ద్వారా తెలుసుకోవచ్చు. నివాసికి సంబంధించిన ఆధార్ లేఖ ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను ప్రెసిడెంట్ పోర్టల్‌ నుంచి కూడా గ్రహించవచ్చు. ఈ సందర్భంలో నివాసి డెమోగ్రఫిక్ సమాచారాన్ని తన ఈ- ఐ. డి. నంబరును అందించవలసి ఉంటుంది. ఇలా అందించిన సమాచారం యు.ఐ.డి.ఎ. ఐ సమాచారనిధిలో ఉన్న సమాచారంతో సరిపోలినపుడు నివాసి నమోదు సమయంలో ఇచ్చిన మొబైలుకుగానీ, ఈ- మెయిల్ చిరునామాకుగానీ ఒకసారి వినియోగించదగ్గ పాస్‌వర్డ్ పంపబడుతుంది. ఒకవేళ నివాసి మొబైల్ నంబరు మరియు ఈ- మెయిల్ చిరునామాలు నమోదు సమయంలో సమర్పించకపోయినా లేదా మొబైల్ నంబరును మార్చుకున్నా అటువంటి నివాసులు తమ పేరుతోపాటు కొత్త మొబైలు నంబరు, ఈ- ఐ. డి., పిన్‌కోడ్ మొదలైన వివరాలను అందించి తనిఖీ తరువాత ఒకసారి వినియోగించదగ్గ పాస్‌వర్డ్‌ను పొందవలసి ఉంటుంది. ఈ విధమైన ఒ. టి. పి. కొరకు ఈ- ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. నివాసి ఈ- ఆధార్‌ను యు.ఐ.డి.ఎ. ఐ ప్రాంతీయ కార్యాలయాలు మరియు సంప్రదింపుల కేంద్రాల నుంచి కొన్ని తనిఖీలకు లోబడి పొందవచ్చు..

RTI application fees

338. ఆర్. టి. ఐ. చట్టంలో సూచించిన దరఖాస్తులకు నిర్ణీత ఫీజులను పి. ఎ. ఒ., భా యు.ఐ.డి.ఎ. ఐ లపై చెల్లుబాటు అయ్యేవిధంగా నగదు రూపంలోగానీ/ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోగానీ ఐ. పి. ఒ. రూపంలోగానీ చెల్లించవచ్చు.