ఆధార్ జారీ

ఆధార్ జారీ ప్రక్రియ లో భాగంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన, ప్యాకెట్ పరిశీలన, డెమోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ డే-డూప్లికేషన్ ఉప-ప్రక్రియలు వుంటాయి. ఆధార్ సృష్టి ఎప్పుడు విజయవంతం అవుతుందంటే::

 • న‌మోదు స‌మాచార నాణ్య‌త విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిర్దేశించిన ప్రమాణాల‌కు అనుగుణంగా ఉండాలి
 • ఎన్రోల్మెంట్ ప్యాకెట్ సి.ఐ.డి.ఆర్ లో రూపొందించిన అన్ని నాణ్యతా ప్రమాణాలను నెగ్గాలి.
 • జీవ‌సంబంధ (బ‌యోమెట్రిక్) మరియు జనసంఖ్య సంభంధ పున‌రావృత‌ న‌మోదు రికార్డులేవీ ఉండ‌కూడ‌దు.

పై పేర్కొన్న వాటిలో ఏవి సరికాక పోయినా , ఆధార్ సంఖ్య జారీ కాదు మరియు ఆ సంభందిత ప్యాకెట్ తిరస్కరించబడుతుంది. ఈ క్రింది విశ్లేషణ ఆధార జారీ ప్రక్రియను విశద పరుస్తుంది.

సి.ఐ.డి.ఆర్ కు డేటా పంపించే ప్రక్రియ

ప్రతీ నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిక్షప్తమైన నమోదు ప్యాకెట్ మెషిన్ కు ఇంటిగ్రేట్ చేసిన యు.ఐ.డి.ఎ.ఐఎన్రోల్మెంట్ ఏజెన్సీస్ కు సరపరా చేసిన అప్లోడ్ క్లైంట్ ద్వారా సి.ఐ.డి.ఆర్ కు పంపబడుతుంది. అప్ లోడెడ్ పాకెట్స్ యొక్క రికార్డ్స్ సర్వర్ లో అనుసంధానించబడిన సాప్ట్ వేర్ ద్వారా డూప్లికేట్ పాకెట్స్ నుండి కాపాడబడుతూ నిర్వహణ సమయాన్ని తగ్గించడంమే కాకుండా, ప్యాకెట్ తిరస్కారాన్ని కూడా అరికడుతుంది. స‌ర్వ‌ర్‌కు స‌మాచార బ‌దిలీ కోసం సుర‌క్షిత స‌మాచార బ‌దిలీ విధానాన్ని అనుస‌రిస్తున్నందువ‌ల్ల మ‌రే అనధికార సంస్థకూ ఈ వివ‌రాలు వెల్ల‌డ‌య్యే ప్ర‌మాదం ఉండ‌దు. నివాసి వద్ద నుండి గ్రహించిన పత్రములు స్కాన్ చేయబడి ఎన్రోల్మెంట్ ప్యాకెట్ లో భాగంగా మలచబడి సి. ఐ.డి ఆర్ లోనికి పంపబడతాయి

సిఐడిఆర్ స్వ‌చ్ఛ‌త త‌నిఖీ: ప్ర‌తి స‌మాచార‌ ప్యాకెట్‌ను స‌రైన ప్రామాణిక‌త కోసం(చెక్ సంస్ మరియు ప్యాకెట్ మెటా డేటా) సి.ఐ.డి.ఆర్ లోని ఉత్పాద‌క జోన్‌లో విశ్లేష‌ణ‌కు పంపేముందు సిఐడీఆర్ డీ.ఎం.జ‌డ్‌లో యాంత్రిక ప్ర‌క్రియ ద్వారా స‌మ‌గ్ర త‌నిఖీ చేస్తారు- డిజిట‌ల్ సంఖ్య‌లు, సంత‌కాలు త‌దిత‌రాలతోపాటు వైర‌స్ నిరోధ‌క సాఫ్ట్ వేర్‌ను కూడా ఇందుకోసం వినియోగిస్తారు.

స‌మాచార భాండాగారీక‌రణ (ఆర్కైవ‌ల్‌): : సి. ఐ.డి.ఆర్.లో ప్యాకెట్ భావము చదువబడి డేటా భండాగారములో నిక్షిప్త పరచే ముందు టేబుల్ రూపంలో భద్రపరచ బడుతుంది ఇందుకు అవ‌స‌ర‌మైన‌వి ఏమిటంటే:- :

 • అన్ని అస‌లు ప్యాకెట్లను (న‌మోదు, న‌వీక‌ర‌ణ వ‌గైరా స‌మాచారం) ఎలా ఉన్న‌ది అలా, “ఎప్ప‌టికీ” అందుబాటులో ఉండేవిధంగా ఇసుమంత స‌మాచారం కూడా న‌ష్ట‌పోని రీతిలో భాండాగారీక‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.
 • అధీకృత వ్య‌వ‌స్థ‌లు, కేంద్ర‌క న‌మోదు నుంచి స‌మాచారాన్ని వేరుప‌ర‌చి సుర‌క్షితంగా భ‌ద్ర‌ప‌ర‌చాలి. .
 • భాండాగారీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను భౌతికంగా వేరుప‌ర‌చి లేదా (క‌నీసం కొన్నిభాగాల‌ను); త‌గిన ఆమోదాలు, నియంత్ర‌ణ‌ల‌తో కోరిన‌పుడు స‌మాచారం పొంద‌గ‌లిగేలా భాండాగారీక‌రించాలి.
 • స్వ‌చ్ఛ‌త త‌నిఖీ పూర్తయ్యాక న‌మోదు ప్యాకెట్ల‌ను ప్ర‌ధాన విశ్లేష‌ణ వ‌రుస క్ర‌మంలోకి పంపుతారు. ఉన్న‌త స్థాయిలో ఇందులో దిగువ పేర్కొన్న ద‌శ‌లున్నాయి.

ప్ర‌ధాన విశ్లేష‌ణ వ‌రుస‌క్ర‌మం

స్వ‌చ్ఛ‌త త‌నిఖీ పూర్తయ్యాక న‌మోదు ప్యాకెట్ల‌ను ప్ర‌ధాన విశ్లేష‌ణ వ‌రుస క్ర‌మంలోకి పంపుతారు. ఉన్న‌త స్థాయిలో ఇందులో దిగువ పేర్కొన్న ద‌శ‌లున్నాయి.

స‌మాచార యాంత్రిక ధ్రువీక‌ర‌ణ‌:: ఈ క్రింది వాలిడేషన్ చెక్స్ డెమోగ్రాఫిక్ డేటా కొరకు సి.ఐ.డి.ఆర్ లో చేయబడతాయి .ఇందులో ఏమేం ఉంటాయంటే

 • పేరు, చిరునామా ధ్రువీక‌ర‌ణ
 • ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్పు ప‌రిశీల‌న‌
 • భాషాప‌ర‌మైన విశ్లేష‌ణ‌,.
 • త‌పాలా సంకేత సంఖ్య (పిన్‌కోడ్‌), ప్రాంతీయ ప‌రిపాల‌న స్థానాలు
 • ఆప‌రేట‌రు, ప‌ర్య‌వేక్ష‌కుడు, చెల్లుబాటు ధ్రువీక‌ర‌ణ‌లు

జ‌న‌సంఖ్యాసంబంధ పున‌రావృత నివార‌ణ‌: జ‌న‌సంఖ్యా సంబంధ పున‌రావృత నివార‌ణ‌ను అసాధార‌ణ లేదా స్వ‌ల్ప పున‌రావృత స‌మాచారం (మోసానికి తావులేని సంద‌ర్భాల్లో కొంద‌రి వివ‌రాలు స్వ‌ల్పంగా లేదా పూర్తిగా స‌రిపోల‌డం) అనూహ్యంగా న‌మోదు కావ‌డాన్ని నివారించేందుకు ప్ర‌ధానంగా వినియోగిస్తాం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక నివాసి త్వ‌ర‌గా ఆధార్ రాలేద‌న్న ఆలోచ‌న‌తో మ‌రో కేంద్రంలో మ‌ళ్లీ న‌మోదుకు నిర్ణ‌యించుకోవ‌డం, అలాగే ఐదేళ్ల లోపు పిల్ల‌ల జీవ‌సంబంధ (బ‌యోమెట్రిక్) స‌మాచారం తీసుకోక‌పోవ‌డం, UIDAI విధానము ప్రకారము 5 సంవత్సరముల పిల్లలకు బయోమెట్రిక్స్ తీసుకోరు. వీలయినంతవరకు ఇబ్బంది పెట్టే దుప్లికేట్స్ ను బయోమెట్రిక్ డి-డూప్లికేషన్ మార్గము నుండి తప్పించడమే డెమోగ్రాఫిక్ –డి-డుప్లికేషన్ కర్తవ్యము.దీనివ‌ల్ల తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్యే ఆధార్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య తగ్గుతుంది. .

నాణ్య‌త‌పై మాన‌వ త‌నిఖీ: న‌మోదు ప్యాకెట్లను మాన‌వ‌ప‌ర‌మైన నాణ్య‌త త‌నిఖీకి పంపుతారు. అక్క‌డ వివిధ నాణ్య‌త త‌నిఖీ ఆప‌రేట‌ర్లు జ‌నసంఖ్యాసంబంధ‌, ఛాయాచిత్ర సంబంధ నాణ్య‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలిస్తారు. నివాసి చిత్రం లేదా అస‌లు బొమ్మ ఉన్న‌దీ-లేనిదీ, లింగం-వ‌య‌సు న‌మోదులో తేడా, ఇత‌ర భాష‌ల నుంచి లిపి అంత‌రీక‌ర‌ణ (భాష మార్పు)లో త‌ప్పులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. .

జీవ‌సంబంధ పున‌రావృత నివార‌ణ‌: ఒక ద‌ర‌ఖాస్తుదారు స‌మాచారం (ప్యాకెట్‌) అన్ని స‌మ‌గ్ర‌త ప‌రీక్ష‌లు, జ‌న‌సంఖ్య సంబంధ త‌నిఖీలు పూర్తి చేసుకున్న‌త‌ర్వాత బయోమెట్రిక్ పున‌రావృత నివార‌ణ కోసం జీవ‌సంబంధ ఉప వ్య‌వ‌స్థ‌కు పంపిస్తారు. అన్నిటా అత్యంత ఉన్న‌త‌స్థాయి క‌చ్చిత‌త్వం, ప‌నితీరు కోసం మూడు భిన్న సంస్థ‌ల ఏబీఐఎస్ వ్య‌వ‌స్థ‌లను వినియోగిస్తారు. ఈ క‌చ్చిత‌త్వం, ప‌నితీరు ఆధారంగా త‌మ వ్య‌వ‌స్థ‌లను మ‌రింత మెరుగుప‌రిచేలా ఆ సంస్థ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు కూడా ఇస్తారు. నివాసి యొక్క గుర్తింపు వివరాలను తెలుపకుండా వెండర్ కు నిక్షిప్తరూపంలో సి.ఐ.డి.ఆర్ జారీ చేసిన రిఫరెన్స్ సంఖ్య తో కలిపి పంపిస్తారు. ఈ ఎ.బి.ఐ.ఎస్ వ్యవస్థ నివాసి యొక్క బయోమెట్రిక్స్ ను గ్యాలరీ లో వున్న మిగిలిన బయోమెట్రిక్స్ తో సరిపోల్చి డూప్లికేట్స్ ఏవైనా ఉన్నాయేమోనని పరీక్షస్తుంది. మాన‌వ‌ప‌రంగా తుది నిర్ణ‌యం: ఏబీఐఎస్ వ్య‌వ‌స్థ‌లు అన్ని పున‌రావృతాంశాల‌ను గుర్తించిన త‌ర్వాత వాటిని నిర్ణాయ‌క విభాగానికి పంపుతారు. ఏబీఐఎస్ వ్య‌వ‌స్థ‌లు గుర్తించినవాటిలో సంభావ్య పొర‌పాట్ల‌వ‌ల్ల ఏ ఒక్క‌రికీ ఆధార్‌ను తిర‌స్క‌రించే ప‌రిస్థితి త‌లెత్త‌కుండా చూడ‌ట‌మే ఈ విభాగం ఏర్పాటు ఉద్దేశం.

ఆధార్ జారీ: దేశ‌వాసి విశిష్ఠ‌త‌ను నిర్ధారించేలా ఆధార్ సంఖ్య‌ను కేటాయిస్తారు. ఈ సంఖ్యతో నివాసి జ‌న‌సంఖ్యాసంబంధ స‌మాచారం అనుసంధాన‌మై ఉంటుంది. కాబ‌ట్టి వ్య‌క్తితోపాటు వారి చిరునామా ధ్రువీక‌ర‌ణ‌కు దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ స‌మాచారాన్ని అధీకృత వ్య‌వ‌స్థ‌ల‌కూ పంప‌డం వ‌ల్ల ధ్రువీక‌ర‌ణ ప్ర‌క్రియను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌వ‌చ్చు.

ఆధార్ లేఖ బ‌ట్వాడా

ఆధార్ జారీ తర్వాత , డేటా ముద్రణా భాగస్వామికి చేరుతుంది. ఇక్కడ ట్రాకింగ్ సమాచారము జత చేసి ఆధార్ ముద్రించి లాజిస్టిక్ భాగస్వామి అయిన ఇండియా పోస్ట్ కు చేరుస్తారు. భట్వాడా భాగస్వామి అయిన ఇండియా పోస్ట్ బౌతిక ఆధార్ ప్రతిని నివాసి ఇంటికి చేర్చే భాద్యతను చేపడుతుంది.