యుఐ .డి.ఎ.ఐ పిర్యాదుల నివారణ

Grievances at UIDAI are received through following channels:

యు.ఐ .డి.ఎ.ఐ కాంటాక్ట్ సెంటర్ ద్వారా

ఆధార్ నమోదు, అప్ డేశన్ మ రియు ఇతర సేవలకు సంభదించిన విచారణలకు మరియు ఫిర్యాదులను చేపట్టడానికి యు.ఐ .డి.ఎ.ఐ ఒక కాంటాక్ట్ సెంటర్ ను స్థాపించింది. నమోదు కేంద్రములో నమోదు చేసే ఆపరేటర్ నమోదు నెంబర్ ముద్రించబడిన ఒక రశీదు నివాసికి ఇస్తాడు. ఆ ఇ.ఐ.డి స్లిప్ ను ఉపయోగించి నివాసి యు .ఐ .డి.ఎ.ఐ కాంటాక్ట్ సెంటర్ను క్రింది మార్గాల ద్వారా సంప్రదించవచ్చు.

కాంటాక్ట్ సెంటర్ వివరములు:
రెసిడెంట్ పోర్టల్

తపాలా ద్వారా

ఫిర్యాదులు యు .ఐ.డి.ఎ.ఐ. కు మరియు ప్రాంతీయ కార్యాలయములకు పోస్ట్ ద్వారా పంపవచ్చు. పరిశీలింపబడిన ఫిర్యాదులు ప్రతులు ప్రధాన కార్యాలయమునకు /ప్రాంతీయ కార్యాలయములోనీ సoభందిత శాఖకు ఎ.డి.జి(ప్రజా సంభంద ఫిర్యాదుల అధికారి) అనుమతి తర్వాత పంపబడతాయి. ప్రాంతీయ కార్యాలయములోనీ సoభందిత శాఖ ఫిర్యాదును స్వీకరించి తగిన సమాధానము ఫిర్యాదుదారునికి ప్రత్యక్షముగా ఇస్తూ, యు.ఐ.డి.ఎ.ఐ ప్రధాన కార్యాలయమునకు కూడా ఒక సమాచారము ఇస్తుంది. కొన్నిసార్లు తాత్కాలిక ఉత్తర్వులు కూడా ప్రాంతీయ కార్యాలయము గానీ/ ప్రధాన కార్యాలయము లోనీ సoభందిత శాఖ గానీ పంపే అవకాశము వుంది.

భారత ప్రభుత్వము యొక్క ప్రజా సంభంద ఫిర్యాదుల పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులు

యు.ఐ.డి.ఎ.ఐ ప్రధాన కార్యాలయమునకు పి.జి పోర్టల్ pgportal.gov.in. ద్వారా చేరిన ఫిర్యాదుల వివరములు. ఈ పోర్టల్ లో వున్న వివిధ రకముల విధానములు/పని జరిగే తీరులు :

  • డి.పి.జి( డైరక్టరేట్ ఆప్ పబ్లిక్ గ్రీవన్సేస్),
  • దర్పగ్(డిపార్టుమెంటు ఆప్ అడమిన్ స్త్రాటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రేవేన్సుస్)
  • పేరెంట్ ఆర్గనైజేషన్,
  • డైరెక్ట్ రీస్పటస్,
  • ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్,
  • పెన్షన్,
  • మినిస్టర్స్ ఆఫీస్,
  • పి.ఎమ్స్ ఆఫీస్.

ఫిర్యాదులను పరిశీలించాక ప్రజా సమస్యల పరిష్కార అధికారి అయిన ఎ.డి.జి ఆమోదంతో సంబంధిత ప్రాంతీయ కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయంలోని సంబంధిత సెక్ష‌న్‌కు ఆన్‌లైన్లో పంపుతారు. అటుపైన అక్కడి నుంచి UIDAI ప్రధాన కార్యాలయంలోని పరిష్కార విభాగానికి సమాచారం ఇస్తూ ఫిర్యాదుదారుకు ఆన్‌లైన్లో జవాబు పంపుతారు. అవసరమైన పక్షంలో ప్రధాన కార్యాలయంలోని సంబంధిత సెక్షన్ లేదా ప్రాంతీయ కార్యాలయం మధ్యంతర సమాధానాలు కూడా పంపుతాయి.

ఈ -మెయిల్ విధానం

అనేక సందర్భాలలో ఫిర్యాదులు ఈ-మెయిల్ ద్వారా వస్తుంటాయి. వీటిని పరిశీలించాక సంబంధిత ప్రాంతీయ కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయంలోని సంబంధిత సెక్ష‌న్‌కు నకలు రూపంలో బదిలీ చేస్తారు. అటుపైన ప్రాంతీయ కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయంలోని సంబంధిత సెక్ష‌న్‌ అక్కడి నుంచి యు.డి.ఎ.ఐ (UIDAI) ప్రధాన కార్యాలయంలోని పరిష్కార విభాగానికి సమాచారం ఇస్తూ ఫిర్యాదుదారుకు నేరుగా ఈ-మెయిల్ ద్వారా జవాబు పంపుతారు.