UIDAI గురించి
ఈ వెబ్ సైట్ భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సమస్త యొక్క అధికారిక వెబ్ సైట్. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ “ఆధార్” (టార్గెటెడ్ డెలివరీ ఆప్ ఫైనాన్సియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్) ఆక్ట్ 2016. (ఆధార్ ఆక్ట్ 2016) 12 వ తేదీ జూలై 2016 న భారత ప్రభుత్వము చే స్థాపించబడి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో తన కార్యకలాపాలనుకొనసాగిస్తుంది. ఈ వెబ్ సైట్ రూపకల్పన, నిర్మాణము మరియు నిర్వహణ యు.ఐ.డి.ఎ.ఐ నిర్వహిస్తుంది.
యు.ఐ.డి.ఎ.ఐ కు చట్ట బద్ధత లభించక మునుపు, ఒకప్పుడు భారత ప్రభుత్వానికి అనుభoధంగా వున్న ప్రణాళికా సంఘానికి , ఇప్పుడు నీతి ఆయోగ్ గా పిలవ బడే, అదే సంస్థకు అనుభoధంగా తేదీ జనవరి 28, 2009 విడుదలయిన గజెట్ ప్రకటన నo: A-43011/02/2009-Admn.I) ఉత్తర్వుల ద్వారా పని చేసేది. తరువాత ప్రభుత్వము బిజినెస్ రూల్స్ ను పునఃపరిశీలించి UIDAI ను కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోనీ “ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విభాగానికి అనుభంద కార్యాలయముగా చేర్చారు.
యు.ఐ.డి.ఎ.ఐ ఆధార్ గా ప్రాచుర్యం పొందిన సంస్థ దేశం లోనీ నివాసులందరికి ఒక విశిష్ట సంఖ్యను ఆపాదించాలనే ప్రత్యెక లక్ష్యం తో పనిచేస్తూ (ఎ)నకిలీ గుర్తింపు కలిగిన వాటిని నిర్మూలించడానికి దృడమైన శక్తిగల సాధనము ఆధార్ (బి) అంతే కాకుండా ఎక్కడైనా అతి తక్కువ ఖర్చుతో పరిశీలించుకొనే వీలుంది. మొట్ట మొదటి యు.ఐ. డి సంఖ్యను 29 సెప్టెంబర్ 2010 న మహారాష్ట లో నందుర్బార్ గ్రామ నివాసికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఈ అధికార సంస్థ 120+ కోట్ల ఆధార్ సంఖ్యలను భారత దేశ నివాసులకు ఇచ్చింది..
ఆధార చట్టము 2016 ప్రకారము, యు. ఐ.డి.ఎ.ఐ. ఆధార నమోదు, ఆధీక్రుతము, మరియు ఆధార లైఫ్ సైకిల్ లో ఇమిడి వున్న అనేక దశల వారీ ప్రక్రియ అంతటికీ బాధ్యత వహిస్తూ, పాలనా విధాన రూప కల్పనలో, ఆధార సంఖ్యలను నివాసులకు జారీ చేయుటలో వున్నకార్యనిర్వహణ లను , ఆధీక్రుతము చేయడానికి కావలసిన గుర్తింపు సమాచారాన్ని సకాలంలో అందుబాటులో వుoచడానికి భాధ్యత వహిస్తుంది.
యు. ఐ.డి.ఎ.ఐ గూర్చి మరింత సమాచారము కొరకు, organizational Structure(సంస్థాగత నిర్మాణము) అనే వెబ్ సైట్ లోని విభాగాన్ని దర్శించండి.