Composition of UIDAI Authority-te

చైర్మన్ (తాత్కాలిక), భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ
Chairman(part-time), UIDAIశ్రీ జె.సత్యనారాయణ, ఐఏఎస్ రిటైర్డ్ (1977, ఆంధ్రప్రదేశ్ శ్రేణి) ప్రస్తుతం భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI)తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. వివిధ పాలన విభాగాల్లో ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. పదవీ విరమణకు ముందు 2012 నుంచి 2014 వరకు ఆ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) భావన-సూత్రావళికి సంబంధించి రాజకీయ నాయకులకు, విధాన రూపకర్తలకు శిక్షణ ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

డాక్టర్. అజయ్ భూషణ్ పాండే
ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO), భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థభారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ ద్వారా 2010లో ఆధార్‌ను ప్రవేశపెట్టిన నాటినుంచి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా డాక్టర్ అజయ్ భూషణ్ పాండే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, చమురు కంపెనీలు, ఇతర భాగస్వాములతో ఆయన సన్నిహితంగా పనిచేస్తూన్నారు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ, ఆర్థిక సార్వజనీనత, ఎలక్ట్రానిక్ పాలన తదితర కార్యక్రమాల్లో ఆధార్ వినియోగానికి విశేష కృషి చేశారు. ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల అనుభవంగల ఆయన కేంద్రంలోని పలు శాఖలలో వివిధ హోదాలలో సేవలందించారు. డాక్టర్ పాండే ఐఐటీ-కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. 1998లో అమెరికా వెళ్లి మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్సులో ఎం.ఎస్‌తోపాటు పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత వృత్తి జీవితంలో తన అసాధారణ నాయకత్వాన సాధించిన అద్భుత విజయాలకుగాను అదే విశ్వవిద్యాలయం నుంచి 2009లో అంతర్జాతీయ స్థాయి విశిష్ట నాయకత్వ పురస్కారం అందుకున్నారు.

డా. అజయ్ భూషణ్ పాండే, ముఖ్య కార్య నిర్వహణ
అధికారి(సి.ఇ.ఒ), యు.ఐ. డి.ఎ.ఐ.డా. అజయ్ భూషణ్ పాండే, ముఖ్య కార్య నిర్వహణ అధికారి(సి.ఇ.ఒ), యు.ఐ. డి.ఎ.ఐ. గా భాద్యతలను 2010 నుండి నిర్వహిస్తున్నారు. గత ఆరు సంవత్సరములలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో, బ్యాంకు లతో, ఆయిల్ కంపెనీస్ మరియు ఇతర భాగస్వాములతో విస్తృతముగా, నిర్విరామముగా పనిచేస్తూ ఆధార్ ప్లాట్ఫారం లో ముఖ్య భూమికలైన ప్రత్యక్ష నగదు బదిలీ, ఫైనాన్సియల్ ఇంక్లుజన్, మరియు ఈ-గవర్నెన్స్ ను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు చెందిన అధికారిగా భర్త ప్రభుత్వములో గత 30 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పని చేస్తున్నారు.
డా.పాండే ఐ.ఐ. టి కాన్పూర్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. 1998 లో మిన్నెసోటా యూనివర్సిటీ నుండి ఎం.ఎస్ మరియు పి.హెచ్.డి పట్టాలు పొందారు. ఈయన వ్రుత్తిరీత్యా సాధించిన విజయాలను బట్టి మిన్నెసోటా యూనివర్సిటీ నుండి అంతర్జాతీయు లలో ముఖ్య నాయకుల పురస్కారాన్ని అందించి అభినందించింది.