ఆధార్ నమోదు
ఆధార్ నమోదు ప్రక్రియ వివిధ పనుల సమ్మేళనము. ఇవి ఏవనగా నమోదు కేంద్రాన్ని దర్శించుట, నమోదు పత్రాన్ని పూరించుట, డెమోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ డేటా ను సంగ్రహిచుట., వ్యక్తిగత మరియు చిరునామాను సూచించే ధృవపత్ర నకళ్ళు జతపరచుట, నమోదు ఐ.డి కలిగి వున్న రశీదు ను తీసుకొనుట మొదలగునవి.,
- ఆధార్ నమోదు పూర్తిగా ఉచితము.
- ఎవరైనా/ఎప్పుడైనా దేశంలో ఎక్కడైనా ఆధార్ నమోదు కేంద్రములో వ్యక్తిగత మరియు చిరునామా సూచించే ధృవపత్ర రుజువులు చూపించి నమోదు చేయించుకోవచ్చు.
- యు.ఐ.డి.ఎ.ఐ. నమోదు ప్రక్రియకు సంభదించి విస్తృతమైన 18 రకాల వ్యక్తిగత మరియు 33 రకాల చిరునామా ను పత్రాలను ఎంపికచేసి పెట్టారు. ఆధార్ నమోదు కొరకు దేశంలో ఎక్కడైనా చెల్లు బాటు అయ్యే పత్రాల వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎలక్షన్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, మరియు డ్రైవింగ్ లైసెన్స్ వ్యక్తిగత మరియు చిరునామా గుర్తింపులుగా ఉపయోగపడతాయి.
- పాన్ కార్డ్ మరియు ఏదైనా ప్రభుత్వము చేత జారీ చేయ బడిన గుర్తింపు కార్డు వ్యక్తిగత గుర్తింపు గా ఉపయోగపడతాయి. మూడు నెలల క్రితం తీసుకున్న నీరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్, చిరునామాకు గుర్తింపు గా ఉపయోగ పడతాయి.
- పైన పేర్కొన్నవి సాధారణ గుర్తింపు ఋజువులు ఏమియు లేకపోతే గజేట్టేడ్ ఆఫీసర్/ తెహ్సిల్దర్ తన లెటర్ హెడ్ పై ఫోటో గుర్తింపుతో సహా ఇచ్చిన సర్టిఫికేట్ వ్యక్తిగత గుర్తింపు గా చెల్లుతుంది. చిరునామా గుర్తింపుకు కూడా ఎం. పి,/ఎం, ఎల్. ఎ/ గజేట్టేడ్ ఆఫీసర్/ తహసిల్దార్ తన లెటర్ హెడ్ పై ఫోటో గుర్తింపుతో సహా ఇచ్చిన సర్టిఫికేట్ చిరునామా గుర్తింపును ఆమోదించే పత్రంగా చెల్లుతుంది. వీరే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి కొరకు పంచాయతి సర్పంచ్ గాని / అదే తరహా అధికారాలు కలిగిన ప్రతినిధి ఇచ్చే సర్టిఫికేట్ గాని చిరునామా ను సూచించే పత్రంగా చెల్లుబాటు అవుతుంది.
- కుటుంబములో ఎవరికైనా తగిన గుర్తింపు పత్రములు లేనియెడల , అతని లేక ఆమె పేరు కుటుంబ సాంఘిక భద్రత కార్డు లో వున్నట్లయితే కూడా తప్పక ఆధార్ కొరకు నమోదు చేయించుకోవచ్చు. ఈ సందర్భములో కుటుంబ యజమాని ముందు గా తన యొక్క గుర్తింపు /చిరునామా పత్రాలను చూపించి నమోదు చేసుకోవాలి.ఇప్పుడు కుటుంబ యజమాని తన కుటుంబ సభ్యుల కొరకు పరిచయ కర్తగా వుండి కుటుంబ సభ్యులను నమోదు చేయించవచ్చు.సంభoధ భాంధవ్యాలను సూచించే 8 రకాల పత్రాలను యు. ఐ. డి. ఎ.ఐ ప్రకటించినది. ఆధార్ నమోదు కొరకు దేశంలో ఎక్కడైనా చెల్లు బాటు అయ్యే పత్రాల వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ క్రింద పేర్కొన్న మూడు రకాల నమోదు పద్దతులను గమనించవలెను:
పత్రముల ద్వారా
- ఆమోదయోగ్యమైన చిరునామా/వ్యక్తిగత పత్రములను సమర్పించుట ద్వారా
కుటుంబ యజమాని ద్వారా
- తనకున్న వ్యక్తిగత సంభందాన్ని పత్రాల ద్వారా ధృవీకరిస్తూ, కుటుంబ యజమాని కుటుంబ సభ్యులను నమోదు చేయించవచ్చు
పరిచయకర్త ద్వారా
- ఎటువంటి వ్యక్తిగత లేక చిరునామా గుర్తింపు పత్రాలు లేని సందర్భాలలో ,పరిచయకర్త సేవలను వినియోగించ కోవచ్చు. రిజిస్ట్రార్ చేత నియమించబడిన పరిచయకర్త తప్పక సరియైన ఆధార్ నెంబర్ ను కలిగి వుండాలి. రా .
- ఆధార్ కేంద్రములో మీ వ్యక్తిగత వివరములు తప్పక దరఖాస్తు లో నింపాలి. నమోదు ప్రక్రియలో భాగంగా మీ ఫోటో, వ్రేలి-ముద్రలు మరియు కంటి-పాప స్కాన్ తీసుకుంటారు. నమోదు చేసే సమయంలోనే మీ యొక్క వివరముల సరిగా ఉన్నవో లేదో తెలుసుకొని వాటిని సరిచేయించుకొనే సౌకర్యం వుంది. ప్రక్రియ అయిన తరువాత అన్ని వివరములు , మరియు నమోదు సంఖ్య తో కూడిన రశీదు ఇస్తారు. ఈ రశీదు లోని వివరాలలో ఏవైనా తప్పులు వుంటే 96 గంటల లోపు అదే కేంద్రములో సరి చేస్తారు.
- యు. ఐ.డి.ఎ.ఐ సలహా ఇస్తే తప్ప, ఆధార్ నమోదు ఒక్కసారి మాత్రమే చేయించుకోవాలి. పలుమార్లు నమోదు చేయించడంవలన తిరస్కరించబడే అవకాశముంది.
- రెసిడెంట్ డేటా పాకెట్స్ సి.ఐ.డి.ఆర్ కు చేరిన తర్వాత ఆధార్ సంఖ్య జారీ కావడానికి సుమారు 60-90 రోజులు పట్టవచ్చు. ఎన్.పి.ఆర్ ద్వారా నమోదు అయితే మర్రిన్ని ఎక్కువరోజులు పట్టే అవకాశముంది.
ఆధార్ కొరకు ఎక్కడ నమోదు చేయించుకోవాలి:
అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రముల లో ఆధార్ నమోదు కార్య క్రమములు ఆర్.జి.ఐ ద్వారా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లో భాగంగా జరుగుచున్నవి. మిగిలిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నివాసులు తప్పక ఆధార్ నమోదు కేంద్రము లేక /ఆధార్ క్యాంపులు లేక శాశ్వత నమోదు కేంద్రములలో మాత్రమే నమోదు చేసుకోవాలి.