రిజిస్ట్రార్లు

వ్యక్తుల గుర్తింపునకు, నమోదుకు అనుమతి పొందిన లేదా UIDAI గుర్తించినవే పాలనాధికార సంస్థలు (రిజిస్ట్రార్లు). ఒక అవగాహన ఒప్పందంద్వారా ఇవి UIDAI భాగస్వాములుగా ఉంటాయి. నిబంధనలకు లోబడి తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తాయి. ఇవి ప్రధానంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు అయి ఉంటాయి. నివాసుల నుంచి సమాచార సేకరణ కోసం UIDAI తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినవై ఉంటాయి..

Who can be Registrars?

వ్యక్తుల గుర్తింపునకు, నమోదుకు అనుమతి పొందిన లేదా UIDAI గుర్తించినవే పాలనాధికార సంస్థలు (రిజిస్ట్రార్లు). ఒక అవగాహన ఒప్పందంద్వారా ఇవి UIDAI భాగస్వాములుగా ఉంటాయి. నిబంధనలకు లోబడి తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తాయి. ఇవి ప్రధానంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు అయి ఉంటాయి. నివాసుల నుంచి సమాచార సేకరణ కోసం UIDAI తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినవై ఉంటాయి..

పాలనాధికార సంస్థలు (రిజిస్ట్రార్లు)గా ఎవరు ఉండొచ్చు?

వ్యక్తుల గుర్తింపునకు, నమోదుకు అనుమతి పొందిన లేదా UIDAI గుర్తించినవే పాలనాధికార సంస్థలు (రిజిస్ట్రార్లు). సాధారణంగా ఇవి ప్రభుత్వ విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వ/కేంద్రపాలిత ప్రాంత, ప్రభుత్వరంగ సంస్థలకు చెందినవై ఉంటాయి. అలాగే దేశవాసులతో సంబంధాలు కలిగి, కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు కూడా కావచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖ (NREGS) లేదా పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ (TPDS), భారత జీవితబీమా సంస్థ వంటి బీమా సంస్థలు, బ్యాంకులు ఇందుకు కొన్ని ఉదాహరణలు.

పాలనాధికార సంస్థలు కావడం ఎలా?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఆర్థిక సంస్థలతో ప్రాథమికంగా UIDAI సంధానమై ఉంది. ఆ మేరకు ప్రతి రిజిస్ట్రార్ తో నిర్దేశిత పాత్ర, బాధ్యతలను నిర్వచిస్తూ రూపొందించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయా రిజిస్ట్రార్లు తమంతటతాముగానీ, తాము ఎంపికచేసిన సంస్థలనుగానీ నమోదు ప్రాతినిధ్య బాధ్యతల్లో నియమించవచ్చు.

ప్రభుత్వ, ప్రభుత్వేతర రిజిస్ట్రార్లు

 • UIDAIకి రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్రపాలిత ప్రాంత ప్రాతినిధ్య సంస్థలు ప్రభుత్వ రిజిస్ట్రార్ల కిందకు వస్తాయి. అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన అన్ని బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వేతర రిజిస్ట్రార్లుగా పరిగణనలో ఉంటాయి. రిజిస్ట్రార్ల పాత్రలు-బాధ్యతలు
 • UIDAIకి భాగస్వాములుగా ఉంటూ సంస్థ నిర్వచించిన పర్యావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని ఆధార్ నమోదు ప్రక్రియలో వినియోగించడం.
 • నమోదు ప్రక్రియ కోసం సంస్థ అందజేసిన సాఫ్ట్ వేర్ మాత్రమే ఉపయోగించాలి. ప్రతి నమోదు/నవీకరణలో భాగంగా ప్రతి నమోదు ప్యాకెట్ కు సంబంధించిన ఉపయోక్త కార్యక్రమం, ఆపరేటర్, పర్యవేక్షకులు, నమోదు ప్రాతినిధ్య సంస్థ, రిజిస్ట్రార్, తదితర సమాచారాన్ని ఈ సాఫ్ట్ వేర్ అందిపుచ్చుకోగలదు.
 • • కంప్యూటర్, ప్రింటర్, బయోమెట్రిక్ పరికరాలు వంటివన్నీ సంస్థ ఎప్పటికప్పుడు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉండాలి..
 • నమోదుకు ఉపయోగించే బయోమెట్రిక్ పరికరాలు సంస్థ నిర్దేశించిన నిబంధనల ప్రకారం, సంస్థ సూచించిన ధ్రువీకరణ ప్రక్రియకు అనుగుణంగా ఉండాలి..
 • నివాసుల ఆధార్ నమోదు కోసం ప్రాతినిధ్య సంస్థలను నియమించాలి. వాటికి శిక్షణ ఇవ్వడంతోపాటు క్రమబద్ధంగా పర్యవేక్షించాలి.
 • సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతోపాటు శిక్షణ, అవగాహన కల్పన, నమోదు, అధీకృతీకరణ తదితర ప్రక్రియలన్నీసంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలి.
 • తాముగానీ, తాము నియమించిన సంస్థలుగానీ నమోదు ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకోసం గుర్తింపు పొందిన జాబితా నుంచి సంస్థలను ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే తమ సొంత వ్యవస్థలద్వారా కూడా తగిన ప్రాతినిధ్య సంస్థలను ఎంచుకోవచ్చు.
 • అన్ని నమోదు ప్యాకెట్లు నిర్దేశిత సమయంలో, సురక్షిత FTP చానెల్ ద్వారా మాత్రమే సిఐడీఆర్‌కు చేరేలా పర్యవేక్షించాలి.
 • నమోదు ప్రక్రియలో సేకరించిన సమాచారానికీ తగిన భద్రత కల్పించాలి. మద్దతు పత్రాల నకళ్లన్నీ జాగ్రత్త చేయాలి. అవి ఎప్పుడు కావాలన్నా UIDAIకి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
 • సామాజిక/పౌర సంస్థలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యంద్వారా బలహీనవర్గాలవారు పూర్తిస్థాయిలో నమోదయ్యేలా చూడాలి. ఫిర్యాదుల పరిష్కారం, నమోదు ప్రాతినిధ్య సంస్థల పనితీరుపై పర్యవేక్షణ వంటి సంస్థ నిర్దేశించిన ప్రక్రియలకు సరైన ఏర్పాట్లు చేయాలి. వివాదాలేవైనా ఉంటే వాటిని పరిష్కరించడంలో UIDAIకి సహాయసహకారాలు అందించాలి.

రిజిస్ట్రార్లకు సమగ్ర అవగాహన కల్పన పత్రాలు

రిజిస్ట్రార్లకు సమగ్ర అవగాహనతోపాటు నమోదు ప్రక్రియలో సహాయపడేందుకు UIDAIవద్ద నిర్దిష్ట పత్రాలున్నాయి. రిజిస్ట్రార్లకు సంబంధించిన అన్ని పత్రాలను సదా నవీకరించడమేగాక వారి పరిశీలన కోసం వెబ్ సైట్లో సర్వదా వాటిని అందుబాటులో ఉంచుతారు. సమగ్ర అవగాహన కలిగిన రిజిస్ట్రార్ల ఆమోదిత జాబితాసహా సాపేక్ష అవగాహన ఒప్పందం కూడా వెబ్ సైట్లో ఉంటాయి. , ఎంపిక చేసిన ప్రాంతంలోని నివాసులందరి నమోదు ప్రక్రియకు తగిన వ్యూహాన్ని రిజిస్ట్రార్ రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఇందుకోసం RFQ/RFP నమూనాలో నమోదు ఏజెన్సీని కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక సాంకేతిక కమిటీ ద్వారా ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలపై తనిఖీ అనంతరం నమోదు బాధ్యత స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న ఏజెన్సీల జాబితా UIDAIవద్ద ఉంటుంది.

నమోదు ఏజెన్సీని ఎంపిక చేసేందుకు UIDAI రూపొందించిన నమూనా RFQ పత్రం సంస్థ వెబ్ సైట్లో సిద్ధంగా ఉంటుంది. రిజిస్ట్రార్ అవసరాలకు, నమోదు ప్రారంభించదలచిన ప్రదేశంలో భౌగోళిక ప్రాంతానికి తగినట్లు ఈ పత్రంలో మార్పుచేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది..

నమోదు ఏజెన్సీ ఎంపికలో రిజిస్ట్రార్ పరిశీలించాల్సిన అంశాలు కిందివిధంగా ఉంటాయి

 • సాంకేతిక, ఆర్థిక సామర్థ్యం
 • నమోదు చేయాల్సిన పరిమాణం
 • ఆ ప్రదేశంలో నమోదు ప్రక్రియ ప్రణాళిక
 • సమాచార నిల్వ అవసరాలు
 • నమోదుకు మౌలిక సదుపాయాల కల్పన

సార్వజనీనతలో రిజిస్ట్రార్ల పాత్ర

మహిళలు, పిల్లలు, వృద్ధులు, శారీరక వికలాంగులు, నైపుణ్యరహిత-అసంఘటితరంగ కార్మికులు, సంచార జాతులు లేదా శాశ్వత నివాసం లేని వ్యక్తులు లేదా అలాంటి ఇతరత్రా వ్యక్తులు... మొత్తం అందరూ ఆధార్ కోసం నమోదయ్యేలా రిజిస్ట్రార్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

UIDAI నిర్దేశించిన వాటిలో ఒకటికిమించి ధ్రువీకరణ పత్రాలు కలిగినవారేగాక, ఏ ధ్రువీకరణ పత్రమూ చూపలేని అణగారిన/దుర్బలవర్గాల వ్యక్తులు, సమూహాల వారంతా నమోదయ్యేలా చూసే వెసులుబాటు రిజిస్ట్రార్ పరంగా ఉండటం తప్పనిసరి. .

మహిళలు మాత్రమే నమోదు చేసుకునే ప్రదేశంలో మహిళా ఆపరేటర్లను నియమించే వీలు రిజిస్ట్రార్లకు ఉండాలి. అలాగే నవజాత శిశువులకు ఆస్పత్రులలోనే ఆధార్ నమోదుకు వెసులుబాటు కల్పించాలి.

రిజిస్ట్రార్ల కార్యకలాపాలు

Following are the activities in which Registrar gets involved

 • నమోదు ఏజెన్సీలకు అవగాహన కల్పించడం
 • నమోదు ప్రక్రియ నిర్వహణ, పర్యవేక్షణపై శిక్షణ ఇవ్వడం
 • విశ్లేషణ కోసం సిఐడిఆర్‌కు నమోదు ప్యాకెట్లను బదిలీ చేయడం
 • నమోదు పత్రాలను పత్రాల నిర్వహణ పద్ధతి (DMS) రూపంలో అందజేయడం
 • నమోదు సందర్భంగా సేకరించిన పత్రాల తనిఖీ
 • సమావేశాలకు హాజరవుతూ ప్రక్రియపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం