Aadhaar Authentication for Financial Transactions-te

ఆర్థిక లావాదేవీల కోసం ఆధార్‌ ప్రమాణీకరణ

 

నివాసులకు తరచూ ఎదురయ్యే సమస్య తమ వ్యక్తిగత గుర్తింపును నిరూపించుకోవడం. ప్రాతినిధ్య పత్రాల వినియోగం, నకిలీ పత్రాల చలామణీవల్ల ఈ సమస్య మరింత జటిలం అవుతోంది. ఇది సేవాప్రదాతలు, నివాసుల మధ్య అపనమ్మకానికి దారితీస్తుంది. అయితే, ఆధార్ సంఖ్యదారు తన సేవాప్రదాతకేగాక దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా గుర్తింపును నిరూపించుకోగల ధీమాను ఆధార్ సంపత్తి అయిన ప్రమాణీకరణ కల్పిస్తుంది. ఈ భరోసా కల్పన కోసం UIDAI ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలతో కూడిన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రమాణీకరణ ఎందుకోసం చేసిందీ UIDAIకి కూడా తెలియనంత సమాచార గోప్యత, ప్రమాణీకరణలో విశ్వసనీయత ఈ వ్యవస్థలో భాగంగా ఉంటాయి.

<pఒక వ్యక్తి గుర్తింపును ఆన్‌లైన్‌ద్వారా వివిధ మార్గాల్లో (బయోమెట్రిక్ – వేలిముద్ర, కనుపాప; జనసంఖ్యసంబంధ, మొబైల్ ఫోన్ లేదా ఈ మెయిల్‌కు పంపే ఒకసారి సంకేత పదం(ఒ.టి.పి) తనిఖీ చేసేందుకు UIDAI వీలు కల్పిస్తుంది. ఆర్థిక రంగ కోణం నుంచి UIDAI ప్రమాణీకరణద్వారా వివిధ భాగస్వాములు పొందే కీలక ప్రయోజనాలు కొన్నిటిని దిగువ ఇచ్చిన జాబితాలో చూడవచ్చు.
నివాసులు
  • ఆర్థిక లావాదేవీలకు సులభ మార్గం
  • సూక్ష్మ ఏ.టీ.ఎం ప్రాతిపదికగాగల ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(AEPS)తో బ్యాంకు ఖాతాల సంఖ్య పెరుగుదలవల్ల ఆర్థిక సార్వజనీనతకు తోడ్పాటు
  • గ్రామాల్లో సూక్ష్మ ఏ.టీ.ఎంలు అందుబాటులో ఉన్నందున గ్రామీణులు బ్యాంకుకు వెళ్లే ప్రయాస, ప్రయాణ ఖర్చు, సమయం వృథా తప్పుతాయి..
  • సూక్ష్మ ఏ.టీ.ఎంల ఆన్‌లైన్‌ స్వభావం వల్ల గ్రామంలోనేగాక ఎక్కడైనా సొమ్ము అందుబాటులో ఉంటుంది.
  • ప్రభుత్వ చెల్లింపులలో జాప్యం గణనీయంగా తగ్గుతుంది. సంక్షేమ చెల్లింపుల స్వీకరణలో దళారుల జోక్యం తప్పుతుంది.
  • Reduces the involvement of middlemen to receive their welfare payments
ప్రభుత్వ శాఖలు
  • ఆధార్ ప్రమాణీకరణవల్ల నిధులు లక్షిత లబ్ధిదారుకు మాత్రమే చేరుతాయి. దీనివల్ల లక్షిత వర్గాలను స్పష్టంగా గుర్తించవచ్చు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా – బ్యాంకులు
  • లావాదేవీల వ్యయం, బ్యాంకులు లేని ప్రాంతాలకు సేవల విస్తరణ వ్యయం తగ్గుతాయి. సూక్ష్మ ఏ.టీ.ఎంల సమగ్ర ప్రమాణీకరణవల్ల బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల్లో వ్యాపార సంధానకర్తల (బిజినెస్ కరస్పాండెంట్లు-BC)పై బ్యాంకులు ఆధారపడవచ్చు. ఎక్కువ బ్యాంకు శాఖలు, ఏ.టీ.ఎంల ఏర్పాటు అవసరం వుండదు.
  • ఎలక్ట్రానిక్ చెల్లింపులకు బలం చేకూరడంతో బ్యాంకులపై నగదు నిర్వహణ వ్యయభారం తగ్గుతుంది. ఆధార్ ఆధారిత సూక్ష్మ చెల్లింపుల ప్రతిపాదన మరియు సూక్ష్మ చెల్లింపుల లో పెరుగుదల బ్యాంకులకు లాభదాయకంగానూ ఉంటుంది.
  • భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)
  • ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS) వినియోగం సంక్షేమ సేవల వితరణను మెరుగుపరచాలనే ఉద్దేశ్యం నెరవేరేందుకు దోహదపడుతుంది.
UIDAI
  • Use of Aadhaar Enabled Payment System would help achieve stated purpose of improving delivery of welfare services

మౌలిక సదుపాయాలు, వ్యవస్థ అవసరాలు, గోప్యత నిబంధనలు, సేవల నాణ్యతలను ప్రమాణీకరించే దిశగా సూక్ష్మ ఏ.టీ.ఎంల ప్రమాణాలను UIDAI ప్రచురించింది. భారత బ్యాంకర్ల అసోసియేషన్ కూడా దీన్ని ఆమోదించింది. పరిశీలన విభాగంలో సూక్ష్మ ఏ.టీ.ఎంల తాజా ప్రమాణాలను చూడవచ్చు. సూక్ష్మ ఏ.టీ.ఎంల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సూక్ష్మ ఏ.టీ.ఎంలకు నిధులు సమకూర్చే పథకాన్నికూడా UIDAI ప్రారంభించింది. ఈ పథకం వివరాలను పరిశీలనా విభాగంలో చూడవచ్చు.

ఆధార్ ప్రింట్

View All

ఆధార్ టెలికాస్ట్

View All

ప్రెస్ రిలీజ్

View All

ఆధార్ లో సంఖ్య

Aadhaar Generated
Authentication Done