ఆధార్ లక్షణాలు మరియు ప్రయోజనాలు ఏమిటి?

ఒకే ఆధార్: ఆధార్ ఒక విశిష్టతలు కలిగిన నెంబర్ కావున ఏ నివాసి కూడా ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నెంబర్ గాని డూప్లికేట్ నెంబర్ గాని పొందలేడు, ఎందువలనంటే ఆధార్ నెంబర్ వ్యక్తిగత బయోమెట్రిక్స్ తో ముడి పడి వుంది. అందువలన ద్వంద మరియు మోసపూరిత మైన గుర్తింపులతో ప్రయోజనాలను పొందే వారిని నివారించడము వీలవుతుంది. ద్వంద మరియు మోసపూరిత మైన గుర్తింపులతో ప్రయోజనాలను పొందే వారిని అరికట్టడము మూలంగా మిగిలే పొదుపు చేయబడిన ద్రవ్యము ఉపయోగించి ప్రభుత్వ పథకాలను మిగిలిన అర్హత కలిగిన నివాసులకు అందజేసే వీలుంది.
సులభ వాహ్యత: ఆధార్ ఒక విశ్వజనీన, సర్వసామాన్య, సార్వత్రిక సంఖ్య. మరియు ఏజెన్సీస్, సేవలు కేంద్ర విశిష్ట గుర్తింపు డేటా బేస్ దేశాములోనుంది ఎక్కడనుండి అయినా సంప్రదించి, చేరుకొని లబ్దిదారుని గుర్తింపును ధ్రువీకరించు కొనే ప్రత్యెక సౌలభ్యము వుంది.
ఎటువంటి గుర్తింపు పత్రములు లేనివారి చేర్పు: బీద మరియు అల్పాదాయ వర్గాల వారికీ ప్రభుత్వ ప్రయోజనాలు పంచడానికి గుర్తింపును నిరూపించే పత్రములు లేకపోవడంము ముఖ్యమైన్ అవరోధము గా మారినది. యు.ఐ.డి.ఎ..ఐ డేటా పరిశీలన కొరకు ప్రవేశ పెట్టి ఆమోదింపబడిన “పరిచయకర్త” వ్యవస్త అటువంటి గుర్తింపు లేని వారి గుర్తింపును చాటుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఎలక్ట్రానిక్ వ్యవస్త ద్వారా ప్రయోజనాల పంపిణీ: యు.ఐ..డి ద్వారా పనిచేసే బ్యాంకు ఖాతా నెట్వర్క్ అతి స్వల్ప ఖర్చుతో మరియు భద్రతతో కూడిన వ్యవస్త ప్రత్యక్ష ప్రయోజనాలను నివాసులకు అందజేసి, ఈ రోజులలో అధిక వ్యయముతో కూడిన ప్రయోజనాల పంపిణీ లో పెనుమార్పులు తెచ్చి మోసపూరిత లాభాలు పొందే వారిని నివారించడానికి దోహదము చేసింది.
ఆధార అధీక్రుతము లబ్దిదారునికి హక్కుగా లభించే ప్రయోజనాన్ని నిర్ధారించుట: యు.ఐ.డి.ఎ.ఐ లభ్దిదారుల గుర్తింపును ద్రువీకరించుట ద్వారా ప్రయోజనాలను పంపిణీ చేసే ఏజెన్సీస్ కు ఆన్ లైన్ ద్వారా అధీక్రితము చేయడానికి అనుమతి ఇస్తుంది. అందువలన లబ్ది పొందవలసిన వ్యక్తికి మాత్రమే ప్రయోజనము చేకూరిందనే నిర్ధారణ లభిస్తుంది. అదే కాకుండా అధికమైన పారదర్శకత మరియు సేవల విస్తరణ ఒనగూరుతుంది. స్పస్టమైన జవాబుదారీ తనము పెరగడము మూలంగా చేసే తనిఖీలు అర్ధవంతముగా మారి లబ్దిదారులకు నాణ్యత తో కూడిన హక్కులను విస్తృతముగా అందించడానికి ప్రభుత్వానికి , ఇతర ఏజెన్సీస్ కూడా తగిన ప్రోత్సహం లభిస్తుంది.
స్వకీయ సేవ నివాసులను అదుపులో వుంచుతుంది.: నివాసులు ఆధార్ అధీకృత సాధనాన్ని వినియోగించుకొని వారి హక్కుల సమాచారాన్ని శీఘ్రముగా తెలుసుకొని, సేవలను తప్పక పొందటానికి మరియు సాధకబాధకాలు/కోర్కెలు సాధన మొబైల్ ఫోన్, కియోస్క్ ల ద్వారా తీర్చుకోవచ్చు.మొబైల్ ద్వారా స్వకీయ సేవలను పొందేవారికి 2-ఫాక్టర్ అధీక్రుతము ద్వారా( నివాసి యొక్క మొబైల్ నెంబర్ మరియు ఆధార్ పిన్ పొంది) భద్రత కల్పిస్తారు. ఈ ప్రమాణాలు రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ మరియు పేమెంట్స్ కొరకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము వున్నవి.