డేటా భద్రతా మరియు గోప్యతను కాపాడే విషయంలో యు.ఐ.డి.ఎ.ఐ వద్దవున్న చర్యలు ఏమిటి?

యు.ఐ.డి.ఎ.ఐ కు డేటా రక్షణ మరియు సేకరించిన డాటాను రహస్యంగా/నిగూడంగా ఉంచాల్సిన భాద్యత వుంది. డేటా యు.ఐ.డి.ఎ.ఐ నిర్దేశించిన సాఫ్ట్ వేర్ ద్వారా సేకరించబడి , దానిని బట్వాడ చేసే క్రమములో చొరబాటుకు లోనుకాకుండా ఉండేందుకు నిక్షిప్త కోడ్ లో భద్రపర్చుతారు. యు.ఐ.డి.ఎ.ఐ డేటా పరి రక్షణ విషయంలో, డేటా భద్రతకు కట్టుదిట్టమైన వ్యవస్థ వుంది అని చిత్తశుద్ధితో చాటడానికి కూడిన సమగ్రమైన భద్రతా విధానము వుంది. అలానే భద్రతకు మరియు నిల్వకు ఒడంబడికలతో కూడిన భాండాగారములు వున్నవి. దీనికి సంభంధిచిన మార్గదర్శకాలు వెబ్ సైట్ లో వెల్లడించబడినవి. ఎటువంటి రక్షణకు సంభందించిన ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు గుర్తింపు సమాచారాన్ని బహిర్గతము చేసినందుకు అపరాధ రుసుములు వున్నవి. అనధికరముగా సి.ఐ.డి ఆర్ ను –తాకడానికి, డేటా చోరీ చేయడానికి(హాకింగ్), డేటా ను తిరగరాయటం చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్రమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.