పాన్ మరియు ఆధార్‌లో నా పేరు భిన్నంగా ఉంది. ఇది రెండింటినీ లింక్ చేయడానికి నన్ను అనుమతించడం లేదు. ఏం చేయాలి?

పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి, మీ జననాంకిక  వివరాలు (అంటే పేరు, లింగం మరియు పుట్టిన తేదీ) రెండు డాక్యుమెంట్‌లలో సరిపోలాలి. ఆధార్‌లోని వాస్తవ డేటాతో పోల్చినప్పుడు పన్ను చెల్లింపుదారు అందించిన ఆధార్ పేరులో ఏదైనా చిన్న అసమతుల్యత ఉంటే, ఆధార్‌తో నమోదు చేసుకున్న మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఆధార్ OTP) పంపబడుతుంది. పాన్ మరియు ఆధార్‌లో పుట్టిన తేదీ మరియు లింగం ఖచ్చితంగా ఒకేలా ఉన్నాయని పన్ను చెల్లింపుదారులు నిర్ధారించుకోవాలి. పాన్‌లోని పేరు నుండి ఆధార్ పేరు పూర్తిగా భిన్నంగా ఉన్న అరుదైన సందర్భంలో, లింక్ చేయడం విఫలమవుతుంది మరియు ఆధార్ లేదా పాన్ డేటాబేస్‌లో పేరు మార్చమని పన్ను చెల్లింపుదారుని ప్రాంప్ట్ చేయబడతారు.

గమనిక:

PAN డేటా అప్‌డేట్ సంబంధిత ప్రశ్నల కోసం మీరు సందర్శించవచ్చు: https://www.utiitsl.com.

ఆధార్ అప్‌డేట్ సంబంధిత సమాచారం కోసం మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు: www.uidai.gov.in

ఒకవేళ లింకింగ్ సమస్య ఇప్పటికీ కొనసాగితే, మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా IT డిపార్ట్‌మెంట్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని అభ్యర్దిస్తున్నాము.