ఆపరేటర్ ఎవరు మరియు అతని/ఆమె అర్హతలు ఏమిటి?

ఎన్‌రోల్‌మెంట్ స్టేషన్‌లలో ఎన్‌రోల్‌మెంట్‌ను అమలు చేయడానికి ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఆపరేటర్‌ని నియమిస్తారు. ఈ పాత్రకు అర్హత సాధించడానికి, వ్యక్తి ఈ క్రింది ప్రమాణాలను కలిగి ఉండాలి:
వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉండాలి.
వ్యక్తి 10+2 ఉత్తీర్ణుడై ఉండాలి మరియు గ్రాడ్యుయేట్ అయి ఉంటె మంచిది.
వ్యక్తి ఆధార్ కోసం ఎన్‌రోల్ చేయబడి ఉండాలి మరియు అతని/ఆమె ఆధార్ నంబర్ జనరేట్ అయి ఉండాలి.
వ్యక్తి కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడంపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి మరియు స్థానిక భాష కీబోర్డ్ మరియు లిప్యంతరీకరణతో సౌకర్యవంతంగా ఉండాలి.
UIDAI ద్వారా నియమించబడిన టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ ఏజెన్సీ నుండి వ్యక్తి "ఆపరేటర్ సర్టిఫికేట్" పొంది ఉండాలి.