పత్రములను స్కాన్ చెయ్యడానికి యు.ఐ.డి.ఎ.ఐ నిర్దేశించిన మార్గాదర్సాకాలు ఏమిటి ?

నమోదు రకాన్ని బట్టి ఆపరేటర్ అసలు పత్రాలను ఏవిధముగా స్కాన్ చెయ్యాలో క్రింద ఇవ్వబడినది:

  • నమోదు పత్రము – ప్రతి నమోదు కొరకు
  • పి ఒ ఐ, పి ఒ ఐ – పత్రము ఆధారిత నమోదు కొరకు
  • డి ఒ బి – పుట్టిన తేదిని పరిసిలించే పత్రము
  • పి ఒ ఆర్ – కుటుంబ యజమాని ద్వారా చేసే నమోదులు
  • అనుమతితో కూడిన రసీదు – ప్రతి నమోదు అనంతరము ఆపరేటర్ మరియు నివాసి సంతకము చెయ్యాలి
  • అసలు పత్రాలు లేని పక్షములో, సంతకము చెయ్యబడిన నకళ్ళు/ పబ్లిక్ నోటరీ చే సంతకం చేయబడిన నకళ్ళు / గాజేట్టేడ్ అధికారిచే సంతకం చేయబడినవి అంగీకరించబడును
  • నకళ్ళు క్రమముగా స్కాన్ చెయ్యవలెను మరియు అన్ని నకళ్ళు సాధారణ ఏ 4 పరిమాణములో స్కాన్ చెయ్యవలెను
  • స్కాన్ చేసేటప్పుడు ఏవైతే స్పస్టముగా కావలెనో (ఆదార్ నమోదు సమయములో ఎంటర్ చెయ్యబడిన సమాచారము) ఆ భాగములు స్కాన్ అయ్యేటట్లు జాగ్రత పడవలెను మరియు స్కాన్ చేయునప్పుడు డాకుమెంట్లు వోకదానిపై ఒకటి పడకుండా చూడవలెను
  • స్కాన్ చేసిన ప్రతి పేజి గీతాలు మరియు దుమ్ము లేకుండా చదవడానికి అనువుగా వుండేటట్లు స్కాన్ చెయ్యాలి. అవసరం అయితే మొదటి సారి చేసిన స్కాన్ ని తోలగించి తిరిగి స్కాన్ చెయ్యవలెను
  • ఒకసారి అన్ని డాక్యుమెంట్ పేజీలు స్కాన్ అయిన తరువాత. ఆపరేటర్ మొత్తం స్కాన్ అయిన పేజిలను క్షుణముగా పరిశిలించి అన్ని పేజీలు స్కాన్ అయినవని నిర్దారించుకోవలెను
  • అసలు పత్రములు మరియు నమోదు పత్రములను నివాసికి తిరిగి ఇచివేయవలెను. మరియు అనుమతితో కూడిన రాసిదును నివాసికి అందచేయవలెను