Authentication Portal-te

ప్ర‌మాణీక‌ర‌ణ పోర్ట‌ల్‌ 

ప్ర‌మాణీక‌ర‌ణ పోర్ట‌ల్‌ను ఇత‌ర వ‌న‌రుల‌కు అవ‌స‌ర‌మైన రూప‌క‌ల్ప‌న‌లు (artifacts) ప‌రిశీల‌నాంశాల‌స‌హితంగా రూపొందించాం. అందువ‌ల్ల ప్ర‌భుత్వ/ ప్రైవేటు విజ్ఞ‌ప్తి సంస్థ‌లు సుల‌భ అవ‌గాహ‌న క‌ల్ప‌న‌కు దీన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఈ ప్ర‌మాణీక‌ర‌ణ పోర్ట‌ల్ (“Auth Portal”)లో దిగువ పేర్కొన్న అంశాలుంటాయి:

  •  వార్షిక ప్ర‌మాణీక‌ర‌ణ లావాదేవీల ధోర‌ణి, గ‌డ‌చిన 12 నెల‌ల కాలంలో UID ప్ర‌మాణీక‌ర‌ణ‌, ప‌నిచేస్తున్నAUAల‌వారీగా ప్ర‌మాణీక‌ర‌ణ ప్ర‌య‌త్నాలు, మొత్తం UID విత‌ర‌ణ‌, అగ్ర‌స్థానంలో ఉన్న‌AUAలు,ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ‌లో దొర్లిన ఐదు ప్ర‌ధాన లోపాల‌ ధోర‌ణి త‌దిత‌రాల‌వంటి ప్ర‌స్తుత ప్ర‌ధానాంశాల నివేదిక‌లతో కూడిన ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న య‌వ‌నిక‌ (Dashboard).
  •  UIDAI జారీచేసిన తాజా న‌వీకృత స‌మాచారం, ప్ర‌క‌ట‌న‌లను ప్ర‌తిబింబించే ప్ర‌క‌ట‌న ఫ‌ల‌కం (notice board).
  •  UIDAI అవ‌గాహ‌న ప‌త్రాలు, ప్ర‌స్తుత సంస్థ‌లు (AUA, KUA, ASA with/without e-KYC services) సాంకేతిక ప‌రిశీల‌నాంశాలు, వినియోగ క‌ర‌దీపిక‌లు, ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ కోసం గూగుల్ గ్రూప్‌, సంస్థ‌ల‌పై త‌ర‌చూ త‌లెత్తే సందేహాలు (FAQ), ప్ర‌మాణీక‌ర‌ణ‌కు సంబంధించి కీల‌క సంప్ర‌దింపు నంబ‌ర్లు, వ్య‌క్తుల వివ‌రాలు తెలుసుకునేందుకు తోడ్ప‌డే సంధాన మార్గాలు (Links).

• ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం... సీడింగ్‌, ప్ర‌త్య‌క్ష ల‌బ్ధి బ‌దిలీ (DBT) సంబంధిత ప్ర‌క్రియ‌లు. UIDAI ప్ర‌మాణీక‌ర‌ణ సేవ‌ల‌ను వినియోగించుకోద‌ల‌చే సంస్థ‌లు ఈ పోర్ట‌ల్‌ను విస్తృతంగా వాడుకుంటాయి. అవ‌గాహ‌న ప్ర‌క్రియ సంద‌ర్భంలో ఆన్‌లైన్‌ద్వారా ఉప‌యోగించుకుంటాయి. సంస్థ‌లనుంచి స‌మాచార జిజ్ఞాస (enquiry)ను అంగీక‌రించాక AUA, KUA, ASAల కోసం ద‌ర‌ఖాస్తుకు వీలుక‌ల్పించే యోగ్య‌త‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జారీ అవుతాయి.

ఆ విధంగా సంస్థ‌లు ప్ర‌మాణీక‌ర‌ణ‌పై త‌మ సంపూర్ణ అవ‌గాహ‌న ప్ర‌క్రియను పోర్ట‌ల్‌ద్వారా పూర్తిచేసుకుంటాయి.