మీరు రసీదు స్లిప్‌లో నమోదు నంబర్ (నమోదు ID), తేదీ మరియు సమయాన్ని నమోదు చేయడం ద్వారా https://myaadhaar.uidai.gov.in/CheckAadhaarStatus నుండి ఆధార్ జనరేషన్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
మీ ఆధార్ జెనెరేట్ చేయబడింది అని స్థితి ప్రదర్శించబడితే:
మీరు https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar నుండి ఆధార్ ఎలక్ట్రానిక్ కాపీని అంటే ఇ-ఆధార్‌ని వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి మొబైల్ నంబర్లో మొబైల్ OTP ప్రామాణీకరణ అవసరం మరియు నమోదు సమయంలో మొబైల్ నంబర్ అందించినట్లయితే మాత్రమే దాన్ని పొందవచ్చు. ఈ సేవ ఉచితం.
మీరు ఆధార్ PVC కార్డ్‌ని కూడా ఆర్డర్ చేయవచ్చు. తేదీ మరియు టైమ్‌స్టాంప్‌తో పాటు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ IDని అందించడం ద్వారా https://myaadhaar.uidai.gov.in/genricPVC నుండి . మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయనప్పటికీ ఈ సేవను పొందవచ్చు. అటువంటి సందర్భంలో, ధృవీకరణ కోసం OTPని స్వీకరించడానికి మీరు ఏదైనా మొబైల్ నంబర్‌ను అందించడం ద్వారా PVC కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. నమోదు సమయంలో అందించిన చిరునామాకు PVC కార్డ్ పంపబడుతుంది. ఈ సేవ కోసం ప్రతి ఆధార్ PVC కార్డుకు రూ. 50/- చెల్లించవలెను.
వ్యక్తిగతంగా ఏదైనా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నమోదు IDని అందించడం ద్వారా “ప్రింట్ ఆధార్” ఎంపిక ద్వారా మరియు (వేలిముద్ర లేదా ఐరిస్) ద్వారా మిమ్మల్ని మీరు ప్రమాణీకరించవలెను. ఈ సేవ కోసం ప్రతి ప్రింట్‌కి రూ. 30/- చెల్లించవలెను .
నమోదు సమయంలో అందించిన చిరునామాపై ఆధార్ లేఖ కూడా పంపించబడుతుంది.
“ఈ నమోదు ప్రక్రియలో ఉంది. దయచేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ తనిఖీ చేయండి.”, వంటి స్థితి ప్రదర్శించబడితే దయచేసి UIDAI హెల్ప్‌లైన్ నంబర్ 1947 (టోల్ ఫ్రీ)ని సంప్రదించండి.